కందం:
*తనుజులనుం గురు వృద్ధుల*
*జననీ జనకులను సాధుజనుల నెవడు దా*
*ఘనుడయ్యు బ్రోవడో యా*
*జనుడే జీవన్మృతుండు జగతి కుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద ఏ వ్యక్తి అయితే తాను ధనవంతుడు గాను, సమాజంలో గొప్ప స్థానంలోనూ ఉండి, తన బిడ్డలను, ఉపాధ్యాయులను, ముసలి వారిని, తల్లితండ్రులను, మంచివారిని, తాను రక్షించగల స్థితిలో ఉండి కూడా రక్షించకపోతే బ్రతికి ఉన్నా చనిపోయినట్టే......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"పరోపకారార్ధం ఇదం శరీరం" అని పెద్దల వాక్యం. భగవంతుని దయతో మనకు మంచి చదువు, ఉద్యోగం, సంపద, సమాజంలో గౌరవమైన స్థానం కలసి వచ్చినప్పుడు, ఎదుటి వారికి మాట సహాయం కానీ, పని సహాయం కాని చేసినప్పుడే, మనకు ఇన్ని ఇచ్చిన పరమేశ్వరునికి మన కృతజ్ఞత చెప్పినట్టు అవుతుంది కదా! ధన సహాయం కానీ, మాట సహాయం కానీ చేసినప్పుడు అవతలి వారు పొందే ఆనందాన్ని చూసినప్పుడు మనకు కలిగే సంతోషం మాటలలో చెప్పలేనిది. చీమలు ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి తమ తోటి చీమకు సహాయ పడతాయి. అలాగే, ఒక కాకి చనిపోతే, పది కాకులు వచ్చి చేరతాయి. ఒక కుక్కకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, పది కుక్కలు ఆ రోడ్డుమీద వెళుతున్న ప్రతీ వాహనాన్ని వెంటాడతాయి, తాము ఏమీ చేయలేము అని తెలిసి కూడా. మరి, తెలిసిన వారము, తెలి ఉన్న వారము అయిన మనం ఒకరికి ఒకరుగా తోడుగా ఉండాలి కదా! ఎదుటి వారికి సహాయ పడే మంచి మనసు మనకు ఇమ్మని ..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి