*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 045*
 కందం:
*జగడంబులాడు చోటను*
*మగువలు వసియించు చోట మదగజము దరిన్*
*బగతుండు తిరుగుచోటన్*
*మగుడి చనగవలయుఁ జలము మాని కుమారా !*
తా:
కుమారా! పోట్లాటలు జరిగే చోటును, ఆడువారు నివాసము ఉండే చోటును, మదించిన ఏనుగు ఉన్న చోటు, శత్రువు దిరిగే చోటు, తొందరగా వదలి పోవాలి......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"అలవిగాని చోట అధికులము అనరాదు" అని పెద్దల మాట. సుగ్రీవుని వాలి నుండి కాపాడాలి అన్నప్పుడు రామచంద్రుడు చెట్టు చాటునుండి బాణము వేసాడు, శత్రువు బలం తనదిగా అవుతుంది అనే వరం వాలికి ఉంది కనుక. రాముడే తగ్గినప్పుడు, మనం ఎంత. మన సామర్థ్యం ఎంత. సమయా సమయాలను అర్థం చేసుకుని, మన తెలివితేటలను, నేర్పును ప్రదర్శించాలి. దీనికే మరో పేరు, "లౌక్యం" గా ఉండడం. కానీ, లౌక్యమే జీవితం కాకూడదు. మనకు ప్రశాంతతను, మనతో ఉన్న వారికి ఉపయోగించే విధంగా, మనం నడచుకునే లౌక్యం మనకు ఇవ్వమని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు