*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 046*
 కందం:
*దుర్జనుల నైనఁదిట్టకు*
*వర్జింపకు సుజన గోష్ఠి : పరులను నెల్లన్*
*నిర్జింతుననుచుఁద్రళ్ళకు ;*
*దుర్జనుడండ్రు నిను నింద ఁదోపకుమారా !*
తా:
కుమారా! చెడ్డవారు అయినా, వాళ్ళను తిట్టకు. మంచి వాళ్ళతో స్నేహం, మాట్లాడటం వదిలి పెట్టకు. కనిపించిన వాళ్ళు అందరినీ చంపేస్తాను అని ఎగిరెగిరి పడకు. ఇలా గనక చేస్తే నిన్ను కూడా చెడ్డవాడుగా చూస్తారు, సమాజంలో అందరూ......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*"ఎదుటి వారికి నువ్వు ఏది ఇస్తే, నీకు కూడా అదే అందుతుంది " అనేది పెద్దల మాట. ఎదుటి వారికి మనం చెడు చేసే ఆలోచన చేస్తే, అ్పటికి మనం సంతోషపడతామేమో గానీ,కొంచెం ఆలస్యంగా నైనా ఏదో ఒక రూపంలో చెడు / హాని మన ఇంటి తలుపు తడుతుంది. ఇది మన పెద్దవారి అనుభవేమే కాదు, మనలో చాలా మంది ఒప్పకోని, మనకు కూడా అనుభవం లోకి వచ్చిన, యదార్థం. అదే, మంచి చేయాలి అని గానీ, లేదా ఒక పని సాధించాలి అని గానీ, ఎదుటి వారు చేసే ప్రయత్నానికి మనకు చేతనైన మాట / చేత సాయం చేస్తే, ఆ పనిలో వారు అనుకున్నది సాధించి, మీ మాట / చేత సహాయానికి ధన్యవాదాలు చెప్పినా, చెప్పక పోయినా కూడా సాధించిన‌ విజయం వల్ల వారు పొందే ఆనందం చూచి నప్పుడు, మనం కూడా ఆనందాన్ని అనుభవిస్తాము. అందువల్ల, మనమందరం నిత్య పూజలో, "సర్వే జనా సుజనా భవన్తు ! సర్వే సుజనా సుఖినో భవన్తు !!" అనీ, "అందరూ బావుండాలి, అందులో నేనుండాలి" అని ప్రార్ధించే మంచి మనసు మనకు అందరికీ ఇమ్మని..... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం