*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 048*
 కందం:
*తరలాక్షుల యెడ నెన్నడు*
*బరిహాసాలాపములను పచరింపకుమీ*
*బరికించి నిరీక్షించిన*
*నురు దోషంబనుచు దలపుచుండు కుమారా !*
తా:
కుమారా! పరాయి స్త్రీలను ఎప్పుడూ కూడా ఆటపట్టించకు. ఆలోచించి చూస్తే మనకు కనిపించిన ప్రతీ స్త్రీ కోసం ఎదురుచూడటం పెద్ద తప్పు అని గ్రహించు.......... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*పరస్త్రీ వ్యామోహం ఎప్పుడూ, ఎవరికైనా మంచిది కాదు. ఈ పరస్త్రీ వ్యామోహానికి లోనై నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకున్న వారు, చరిత్రలో చాలామంది కనిపిస్తారు. ఈ రోజుకు కూడా ఈ లాంటి వ్యక్తులు మన చుట్టుప్రక్కల నే ఉన్నారు. పరస్త్రీలతో ఎలా ప్రవర్తించ కూడదో తెలుసుకోవడానికి, మనకు రామాయణంలో ఒక వాలి, ఒక రావణ బ్రహ్మ ఘట్టాలు వచ్చాయి. అందుకే, రామాయణం ఇతిహాసం కాదు మన మానవ జీవన ప్రయాణానికి చుక్కాని లాంటిది. అందువల్ల, పరస్త్రీ లను గౌరవంగా చూసుకుంటూ, తద్వారా మనల్ని మనం గౌరవించుకుంటూ, బ్రతకు వెళ్ళదీయ గలిగే సద్భాగ్యాన్ని, మనకు ఎల్లప్పుడూ కలగజేయమని...... కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు