మానవ మనస్తత్వాలు భిన్న భిన్న స్వరూపాలు ఒకరి ఆలోచనకు మరొకరి ఆలోచనకు సంబంధమే ఉండదు ఎవరి అభిరుచులు వారివి వారికి ఇష్టమైన పనిని త్వరగా చేస్తారు ఇష్టం లేకపోతే చేయడం మానేస్తారు లేదా చాలా ఆలస్యంగా చేస్తూ ఉంటారు ఒకే కుటుంబంలో ఉన్న భార్యాభర్త పిల్లలు కలిసి ఉన్న మనసులు మాత్రం భిన్నంగానే ఉంటాయి ఒకరికి నచ్చిన కూర మరొకరికి నచ్చదు అమ్మ చేసిన ఏ వంటకాన్ని అయినా కమ్మగా తింటూ లొట్టలు వేసుకుంటూ తన వదిన వంటకాలకు పేర్లు పెడుతూ ఉంటారు తెలిసీ తెలియని వయసులో. ఏ మనిషిలోనైనా భక్తి భావం ఉంటుంది అది లేకపోతే జీవితానికి అర్థం లేదు జీవితమంటేనే నూరేళ్లపంట ప్రతిక్షణం అనుభవిస్తూ ప్రశాంతంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు తల్లి తాగుతున్న గ్లాసులో నీరు తాగితే అది ఎంగిలి అవుతుంది. గ్లాసును కడిగి అక్కడ పెట్టు అని చెప్తుంది అమ్మ. బిడ్డ ఎంగిరి చేసింది అన్న విషయం తను ప్రత్యక్షంగా చూసింది కనుక నిజానికి ఆమె చూడకుండా అతను తాగి ఉంటే తెలుస్తుందా దాని ముద్రలు ఏమైనా పడతాయా ఎలా గుర్తిస్తుంది కనుక అది భౌతికమా? శారీరకమా? ప్రతి విషయంలోనూ జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు ఎలాంటివో అజ్ఞాత కవులు అనేకమంది తత్వాలను రాసి వాటిని ప్రచారం చేశారు అవన్నీ ప్రజల నాలుకల మీద ఆడుతూ ఉంటాయి ప్రత్యేకించి గొప్ప గాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటివారు అలాంటి తత్వాలను ఎన్నుకొని ప్రజల కోసం తీసుకు రావడానికి కంకణం కట్టుకొని తన ప్రతి సంగీత సభలోనూ వాటిని చదివి దాని అర్థాన్ని కూడా విపులీకరించి చెబుతారు నిజానికి అది సమాజానికి ఎంతో అవసరం ఈ ప్రపంచంలో ఎంగిలి లేని ఏ వస్తువునైనా మనం చూడగలమా. అనేకమంది భక్తులు తమ ఇంటి దైవాన్ని పూజించడం కోసం రకరకాల పూలను ఎన్నిక చేసి తీసుకువచ్చి ఎంతో పవిత్రంగా దేవుని పూజిస్తారు మరి ఆ పువ్వులో అంతకుముందు తేనెటీగ లోపల ఉన్న తేనెను మొత్తం రుచి చూసింది అనే విషయం భక్తులకు తెలియదా? భగవంతుడికి ఎంగిరి పదార్థాన్ని ఇస్తామా? నీటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తే అది చాప ఎంగిలితో మైల పడలేదా కనక భౌతికమైన విషయాలను వదిలి వేసి నిర్మలమైన పవిత్రమైన మనసు వారిపై కేంద్రీకరించి ఎలాంటి వేరు ఆలోచనలు లేకుండా అర్పించే హృదయ కమలం పూవే కదా ఆర్తితో ఆరాధించే భక్తుని కన్నీరు పవిత్రమైనవే కదా ఏ ఎంగిడికి నోచుకోలేదుగా అలాంటి స్థితిని వదిలివేసి పంతాలతో పట్టింపులతో అజ్ఞానంతో ప్రతిదీ పట్టించుకున్నప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళలేము అని పెద్దల ఉవాచ
ఆచరణీయం (1);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి