వృద్ధాప్యం (1);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ముసలి తనంలో సామాన్యంగా ప్రతి వ్యక్తికి  కొంచెం నలతగా ఉన్నా  బిడ్డలతో చెప్పుకొని సేద తీరాలనుకుంటాడు  వారి కష్టాలు బాధలు  వినడానికి ఓపిక ఉన్న కుర్రవాళ్ళు ఈ రోజున చాలా తక్కువ  ఏదైనా అత్యవసరం వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లడం తప్ప చిన్న చిన్న విషయాలను గురించి ఎవరూ పట్టించుకోరు. వారి బాధను ఏ కరువు పెడుతూ ఉంటే వాళ్లకు చాలా  అయిష్టంగా ఉంటుంది  కనీసం వినడానికి కూడా వారు సంసిద్ధులు గారు  దానివల్ల ప్రయోజనం ఏముంది  రోలు వెళ్లి రోకలితో మొత్తుకున్నట్లు ఉంటుంది  కనుక తన పరిధిని గమనించి  అత్యవసరమైతే తప్ప ఆ విషయాన్ని గురించి ప్రస్తావించకుండా ఉండడం చాలా మంచి పని  భార్యాభర్తలు దాదాపు  నాలుగైదు సంవత్సరాల భేదంతో  ప్రక్క ప్రక్కన ఉంటారు కనుక ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటే సరిపోతుంది  అని సరిపెట్టుకోవలసిందే.
ఇవాళ యువతరం  బాగా చదివి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ తమకాళ్ళ పైన తాము నిలబడాలని భావిస్తారు తప్ప  తల్లిదండ్రుల ఆస్తి కోసం  వారి సంపాదన కోసం ఆశపడుతూ ఉన్నవాళ్లు చాలా తక్కువ  కనుక ఉద్యోగం చేయవలసినదే ఎందుకంటే  తమ ఆదాయ వనరులను గురించి వారితో మాట్లాడవలసిన అవసరం లేదు  మీకు వస్తున్న పెన్షన్ కానీ బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ కానీ  మీకు ఎంత వస్తుందో దానినే లెక్కపెట్టి  దానిలో కొంత మిగిల్చి పొదుపుగా వాడి  మూలధనంగా ఉంచుకోవడం చాలా మంచిది  రేపు ఆరోగ్యరీత్యా కానీ మరి ఏదైనా  అవసరం వస్తే కానీ డబ్బులు కావాలంటే  పిల్లలను అడగడానికి నామోషి  అయ్యో పాపం ఏమనుకుంటారో వారి మీద భారం పెడుతున్నామే  అన్న ఆలోచనకు గురికాకుండా  ముందు జాగ్రత్తగా  దాచుకోండి  మీరు ఏదైనా వారికి ఇవ్వ దలచుకుంటే మీ తదనంతరం  వారికి వచ్చేట్లుగా విలునామా రాయండి  అంతేకానీ ముందే చేతులు కాల్చుకుంటే  పిల్లల మనస్తత్వాలు  కొడుకు తన వాడు అయినా కోడలు బయట అమ్మాయి కదా  వారి ఆలోచనలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు  కనుక వృద్ధులు తమ జాగ్రత్తలో వారు ఉండటం చాలా మంచిది.
ఈ వయసులో బంధుత్వాలకు స్నేహాలకు దూరంగా ఉండకూడదు  ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా లేదా  ఏదైనా ఆపద వచ్చినా వెళ్లి వారి ఆనందంలోనూ కష్టంలోనూ పాలు పంచుకుంటే  మీకు ఆనందంగా ఉంటుంది వారికి ఆనందంగా ఉంటుంది. వయసు రీత్యా రావడం అనేది కొంచెం కష్టమైన  అదే ఆరోగ్యానికి మంచిది  మానసికంగా  ఉత్సాహంగా ఉంటుంది  ఏ కొంచెం మీ పనులు మీరు చేసుకోవడానికి ఓపిక ఉన్న  మీరు దగ్గరలో ఉన్న పార్కు  కు వెళ్లి  మీ వయసులో మీలాగా అక్కడకు వచ్చే పురుషులను  పరిచయం చేసుకొని వారితో కాలక్షేపం చేస్తే  చాలా రిలీఫ్ గా ఉంటుంది  కాలం గడవడమే కాదు  అక్కడ పచ్చటి ప్రకృతిని చూస్తూ ఆనందంతో   తోటి వారితో మాట్లాడుకుంటున్నామన్న  ఆహ్లాదానికి విలువ కట్టలేము.

.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం