నరసింహ మూర్తి గారి స్కంధ గుప్త నాటకంలో బందా కనక లింగేశ్వర రావు గారు నండూరి విఠల్, కందుకూరి రామభద్ర రావు, ఏడిద కామేశ్వర రావు గారితో పాటు శ్యాం సుందరి, మధుసూదన్ రావు, రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కందుకూరు రామభద్ర రావు గారు మంచి కవి డీఈఓగా పదవీ విరమణ చేసిన తర్వాత రేడియో కేంద్రానికి వచ్చి విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మంచి పొడగడి చూడగానే గౌరవం కలుగుతుంది. ఉత్తమంగా ఉండేవారు విరబ్బాయి సూర్యనారాయణ వివాహం విజయవాడలో జరిగినప్పుడు బందా గారితో పాటు మేము అంతా కూడా వెళ్ళాము. ఆ నాటకంలో ప్రధాన పాత్రధారి నాకే ఇచ్చారు బందాగారు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన లేఖలను కొన్నిటిని ఎన్నిక చేసి దానిని రాచకొండ వారితో అనువదింప చేసి బందా గారు నాతోనూ వింజమూరి లక్ష్మి తోనూ రూపక పద్ధతిలో దానిని చదివించారు. తర్వాత బందాగారికి నచ్చిన నాటకం ఎం రామకృష్ణా రావు రచించిన నిష్కృతి. ఆ నాటకంలో నాకు మంచి పేరు వచ్చింది. నాతో పాటు లత గారు, నాగరత్నమ్మ, కుమార్ గారు కూడా నటించారు. ఆ సమయంలో విజయవాడ కేంద్రం నుంచి వాణి పక్షపత్రిక నడపబడుతూ ఉండేది. ఆ పత్రికలో ఈ నాటికను గురించిన ఛాయాచిత్రం మాది ప్రచురించడం మొదటిసారి. ఆ విధంగా కూడా మాకు మంచి పేరు వచ్చింది. బందాగారికి నచ్చిన సంగీత రూపకం వసంతోత్సవం దానిలో నన్ను కథానాయకుడుగా ఎన్నుకొని ఎన్.సి.వి జగన్నాథాచార్యులు గారు, శ్యామసుందరి, గోపాల రత్నాలను కూడా ఎన్నిక చేసి ఓలేటి గారి సంగీత నిర్వహణలో ఆ కార్యక్రమం మంచి పేరు తెచ్చుకుంది.
శ్యామసుందరి గారు విజయవాడ కేంద్రంలో ఆంగ్ల అనౌన్సర్ గా ప్రారంభమై వనితా వాణి స్త్రీల కార్యక్రమానికి ప్రయోక్తగా ఎన్నిక కాబడ్డారు. సన్నటి గొంతుతో చక్కగా మాట్లాడగలదు తర్వాత వనితా వాణి కార్యక్రమంలో ఆమె నిర్వహించిన అనేక నాటకాలలో నేను ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండేవాడిని. శ్రీరంగం గోపాల్ రత్నం గారి కంఠం ఆంధ్రదేశంలో ఎవరికీ ఉండి ఉండదు. శాస్త్రీయ లలిత శాస్త్రీయ సంగీతాలను అద్భుతంగా గానం చేయగలిగిన ఆకాశవాణి నిలయ కళాకారిణి గోపాల రత్నం గారు వస్తే చాలు ఆవిడ కోసం బందా గారు సాధన జరిగే మూడు రోజులు కూడా మూడు రకాల తీపి పదార్థాలను తీసుకువచ్చి అందరికీ ఇచ్చి మాతో పాటు తనూ తినేవారు. వారికి మధుమేహ వ్యాధి అయినా ఒక గుళిక వేసుకుని తిని అది ఇక ఏమి చేయలేదు అని నవ్వుతూ మాతో కాలక్షేపం చేసేవారు. జీవితాన్ని కూడా అంత తేలికగా తీసుకున్న వారు బందా గారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి