ఆకాశవాణి బ్రాహ్మణుల సొత్తు కాదు మాలో మూడు శాఖలు ఉన్నాయి వైదికులు, నియోగులు, వైష్ణవులు ప్రత్యేకించి ఇది వైదికులకు మాత్రమే సంబంధించింది. ఆకాశవాణి అనగానే ప్రతి అక్షరం స్పష్టంగా పలకగలిగిన వాడే ఉండాలి. అలా చెప్పగలిగిన సత్తా ఉన్నవాడే ఇక్కడకు రావాలి అది వైదికులు మాత్రమే చేయగలరు మీ గురువు సుబ్బన్న నియోగి వాడు కథానాయకుడిగా పనికొస్తాడా కనుక రామ్మోహన్ రావును ఎన్నుకున్న తర్వాత వీడిని మూడు సంవత్సరాలకు గాని ఎన్నుకోలేదు. నీవు ఫలానా అని తెలిసిన తర్వాత కూడా నేను నా కథానాయకునిగా ఎందుకు అంగీకరించాను. కొంగర జగ్గయ్య గారిని ఢిల్లీలో వార్తలు చదవడానికి ఎందుకు అంగీకరించారు. స్పష్టత కలిగిన వాడు కనుక అని చెప్పి మాకు టీ ఇచ్చి ఆనందించారు. నేను ఈ ప్రశ్న ఎంతమందిని అడిగినా చెప్పడానికి తప్పించుకున్నారు తప్ప ఇంత స్పష్టంగా నాకు అర్థమయ్యేలా చెప్పిన వారు బందా గారు ఒక్కరే. ఎం నాగరత్నమ్మ గారు విజయవాడ వాసి చక్కగా కాపురం చేసుకుంటున్న సమయంలో ఆమె సన్నిహిత మిత్రురాలు సీతారత్నం గారు వచ్చి నీవు ఎప్పుడైనా రేడియో స్టేషన్ చూసావా అని అడిగితే లేదని సమాధానం చెప్పారు అదేమిటి టౌన్ లో ఉండి మన నగరంలో ఉన్న కేంద్రాన్ని చూడకపోవటం ఏమిటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది సరేనని వారిద్దరూ కలిసి బయలుదేరి కేంద్రానికి వచ్చారు నాగరత్నమ్మ గారికి కనిపించిన మొదటి వ్యక్తి బందా కనక లింగేశ్వర రావు గారు వారిని చూసి అయ్యా మేము రేడియో స్టేషన్ చూడడానికి వచ్చాము చూయించే ఏర్పాటు చేయగలరా అని వినయంగా అడిగింది. ఆ అడిగే పద్ధతి బందా గారికి నచ్చి తన శిష్యుని పిలిచి స్టూడియో లన్నీ చూయించి అక్కడ ఏమేమి జరుగుతాయో అన్నీ వివరించి చెప్పు అని పంపించారు. నాగరత్నమ్మ గారు తిరిగి వెళ్ళేటప్పుడు పిలిచి ఏవండీ మిమల్ని రేడియోలో ఉద్యోగిగా తీసుకుంటే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు. ఆమె ఆశ్చర్యపోయింది ఏదో కేంద్రాన్ని చూద్దామని నేను వస్తే నాకు ఉద్యోగం ఏమిటి అని ఏం చెప్పడానికి పాలు పోక ప్రక్కనే ఉన్న సీతారత్నం గారిని అడిగితే అదేమిటమ్మా రాకరాక వచ్చిన అవకాశం మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తుందా ఇందులో అంత పెద్దవారు అడిగినప్పుడు కాదన వచ్చునా అంగీకరించమని చెప్పారు. దానితో నాగరత్నమ్మ గారు అయ్యా నాకు నాటకం తెలియదు ఎలా మాట్లాడాలో ఎలా సమాధానాలు చెప్పాలో కూడా నాకు తెలియదు మీరు నాతో సాధన చేయించి బాగా చేయించుకోగలమనే నమ్మకం ఉంటే నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ లేకపోతే వద్దు అని ఎంతో వినయంగా చెప్పింది.
నటనకు వ్యాకరణం బందా గారు (19)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి