ఆడపిల్లనని అలుసుగా చూడకు
అబలని నాపై ముద్ర వేయకు
లింగబేధాలతో బాల్యాన్ని చిదమకు
నీ భవితకు నే సమిధనని మరువకు మా...
!!సమాజమా!!
సంద్రమంత లోతైన మది నాది
పుడమి పైన తరువంతా ఓర్పు నాది
కూసింత ఆధారమై నీవు నిలిస్తే
జీవితంలో మల్లెపరిమళం పరిచేస్తా..
!!సమాజమా!!
కనికరమే లేకుండా కాటేయజూడకు
భద్రకాళి గా మారక్షణము పట్టదు
ఆడదంటే కాదుగా అంగడి బొమ్మ
ఆదరణలో తనకు సాటి ఇలనలేదుగా
!!సమాజమా!!
తల్లి చెల్లి ఆలీ బిడ్డగా నీతో ఉంటూ
నిరంతరం నీ గెలుపే నాదనుకుంటూ
పరుల సేవయే తన పరమావధిగా
పదికాలాలు బ్రతుకు బడుగు జీవిగా
!!సమాజమా!!
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి