కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంకురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్పా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తకిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్!
తిరుప్పావై ఇష్టపది-19
గుత్తి దీపములెరియ, కుంభి దంతపు కాళ్ళ
పర్యంకమందునను పంచతూలికపాన్పు
బూలగుత్తులు విరియ,నీలమ్మ కుచగిరుల
నిదురించు దృఢమైన నిడుద రొమ్ములవాడ!
పలుకవేమియు సామి? అలక మాపై యేల?
కజ్జలాక్షీ! నీదు కాంతున్ని లేపుటకు
ఎంత పొద్దైనను ఇష్టపడకుందువే?
క్షణమైన యెడబాటు సహియింపలేవులే!
మేమన్న మాటలూ ఏమన్న తప్పులా?
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!
దీపములు+ఎరియ = దీపములు ప్రకాశించగా
కుంభి = ఏనుగు
పర్యంకము =మంచము
నిడుద = విశాలమైన
కజ్జలాక్షీ =కాటుక కళ్ళదాన!
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి