ఒక అల్లరి పిల్లవాడు ఒక ఆవిడను కించపరిచేలా మాట్లాడుతూ సున్నం అడిగాడు. అంతే, ఆమెకు కోపం వచ్చి ఇలా అన్నది.
శత పత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ శూనుని మామ నుంచి.
సతతము తల దాల్చిన దొర,
సుతువాహన వైరి వైరి సున్నం ఇదిగో!
దీని వివరణ చూడండి: శతపత్రము-పద్మము;
దాని మిత్రుడు-సూర్యుడు;
అతని సుతుడు-కర్ణుడు; అతన్ని చంపిన వాడు-అర్జునుడు; అతని బావ-కృష్ణుడు; అతని శూనుడు (కుమారుడు) మన్మధుడు; అతని మామ-చంద్రుడు; అతన్ని సతతము తలదాల్చిన దొర-శివుడు; అతని సుతుడు-వినాయకుడు; అతని వాహనం-ఎలుక; దాని వైరి-పిల్లి; పిల్లికి వైరి-కుక్క!
ఓ కుక్క ఇదిగో సున్నం అని ఆ బడుద్దాయిని మట్టి కరిపించింది.
అన్యాపదేశ మాధుర్యం.2.;---తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి