నటనకు వ్యాకరణం బందా గారు (20);-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నాగరత్నమ్మ గారు సమాధానం చెప్పిన విధానం వారికి చాలా బాగా నచ్చి  అప్పటికప్పుడు  గుమస్తాను పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్టు మీద సంతకం చేసిన తర్వాత  సార్ మీరే నా గురువు  జీవితంలో నాకు సహాయంగా ఉండే మనిషి  మీరే అని చెప్పిన తర్వాత అమ్మను కూడా తీసుకుంటారా అని అడిగితే  అలా కుదరదమ్మ ఆడిషన్ కి రావాలి  అప్పుడు  ఆ గొంతు రేడియోకి సరిపోతుందనుకుంటే ఎన్నిక చేస్తాం లేకపోతే లేదు అన్నారు. అప్పుడు ఒకసారి ఆడిషన్ కు వచ్చి  మొత్తం చదివి ఆమె బయటకు వచ్చిన తర్వాత బందాగారు కూర్చోబెట్టి  మీరు ఏమీ అనుకోవద్దు ఆకాశవాణి కేంద్రానికి మీ గొంతు సరిపడదు  మీరు కొంచెం సాధన చేసి రేడియోకి ఎలా మాట్లాడాలో  దాని పద్ధతి తెలుసుకొని వస్తే అప్పుడు మాకు నచ్చితే  మిమ్మల్ని నాటక కళాకారిణిగా ఎన్నిక చేస్తాము అది ఉద్యోగం కాదు  అప్పుడప్పుడు మేము పిలిచే నాటకాల రోజు మీరు నటించడం మేము దానికి తగిన ప్రతిఫలం ఇవ్వడం  అంతవరకే  అని చెప్పారు.
నేతి రామ శర్మ గారు  పంపించిన కళా ప్రపూర్ణ నాటకాన్ని చదివి నచ్చి  దానిలో చాలా వరకు గ్రాంథిక భాష ఉంటే దానిని సరళంగా తిరిగి వ్రాయించి  ప్రసారం చేసాం దాంట్లో బందా గారు రామ్మోహన్ రావు గారు నాగరత్నమ్మలతో పాటు నేను కూడా పాల్గొన్నాను. నాకు 1963 లో మంచి అనుభూతిని మిగిల్చిన నాటకం రోహిణి దీని రచయిత బంకిం చంద్ర, ఓలేటి వెంకటేశ్వర్లు, యండమూరి సత్యనారాయణ (సత్య) రామచంద్ర కాస్యప్, నండూరి సుబ్బారావు,  ప్రయాగ నరసింహ శాస్త్రి, చిమటా పద్మనీ, శ్యామల, శ్యామసుందరి, ఎం నాగరత్నమ్మ పాల్గొన్నాము. రామచంద్ర కాస్యప్ కు వృత్తి లాయర్ అయినా నాటకాలంటే ప్రాణం రామన్న పంతులుతో కలిసి రంగస్థల నాటకాలు ఆడేవారు.  వాహినివారి సినిమాల్లో నటించారు. సినీనటునిగా కూడా మంచి పేరుంది.
చిమటాపద్మిని వృత్తి ఉపాధ్యాయురాలు రేడియో నాటకంలో పాల్గొంటూ ఉంటుంది నాతో పాటు చాలా నాటికల్లో  పాల్గొంది   ఇది నాతో మొదటి నాటకం  ఇంతమంది మధ్య కథానాయకుడుగా నెగ్గడం మాటలు కాదు. ప్రయాగ వారి ప్రతి మాట హాస్యమే ప్రక్కన నండూరి సుబ్బారావు గారి హాస్యం  వారి మాటలకు వచ్చిన నవ్వును ఆపుకుంటూ  మళ్లీ పాత్రలోకి వెళ్లడం కత్తి మీద సాము లాంటిది అష్టావధానం చేసినట్లు అవుతుంది ప్రతిసారి  విజయాన్ని వరించడం నా అదృష్టం  బందా గారు నాటకాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  నిర్వహించారు. బందా గారు నిర్వహించిన రూపకంతో జనవరి 1964 సంవత్సరం ప్రారంభమైంది. జయభేరి రూపకం, సామవేదం జానకిరామ శర్మ గారు రచించిన గురుదక్షిణ నాటకం  బందా గారి చేతిలో జీవం ఉట్టి పడేలా రూపం దిద్దుకున్న నాటకం. ఏకలవ్య పాత్రను బందా తీర్చిదిద్దిన తీరు అద్భుతం. ఆయన ద్రోణ పాత్రలో చేస్తుంటే నిజజీవితంలో నాకు గురువుగారి గానే కనిపించారు.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం