నటనకు వ్యాకరణం- బందా గారు (21)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఆ తెల్లవారి నండూరి సుబ్బారావు గారి చిత్ర నళినీయం  నాటకంలో నాగరతమ్మ గారితో నటించడం మరీ ఆనందాన్నిచ్చింది. ఆమె ఎంతో ఆప్యాయంగా కన్నతల్లిగా ప్రేమగా వుండేది.  ఆమెతో పాటు బందా గారు కూడా చిన్న వేషం వేశారు. ఆ తర్వాత బందా గారు రచించి, నిర్వహించిన త్యాగమూర్తి నాటకంలో వారితో పాటు నేను, కమల కుమారి కూడా పాల్గొన్నాం. ఆమె గతంలో రంగస్థల నటి ఎన్టీ రామారావు, జగ్గయ్య గార్లతో కూడా నాటకాలు ప్రదర్శించింది
వేదికపై పౌరాణిక నాటకాలలో కూడా వేషాలు వేసింది.  జాతీయ రూపక కార్యక్రమంలో తర్వాత దేవి చంద్రగుప్త- గొలుసు నాటకాలు ప్రారంభమైన ధారావాహికలో నటించాను. తానాజీ నాటకం నేను ప్రధమంగా వెంపటి వారితో నటించాను  ఆయన గొప్ప నటుడు  వంటకు కుంపటి నాటకానికి వెంపటి అనేది అప్పటి మాట  ఈ నాటకాలను బందా గారు నిర్వహించారు. కలకత్తా నుంచి వచ్చిన సేన్ గుప్తా గారు  ఆకాశవాణి సంచాలకులుగా  పనిచేశారు విజయవాడలో. వారు మంచి రచయిత కూడా  బెంగాలీ లో ఆయన రచించిన  న్యాయాధిపతి నాటకాన్ని  ఆంగ్ల అనువాదాన్ని తీసుకొని  తెలుగులో అనువదింప చేసి దానిని బందా గారు నిర్వహించారు. నాటకం అయిన తర్వాత వారి గదిలో నటించిన మా అందరికీ  ఎస్.డి చక్కటి పార్టీ ఇవ్వడం  ఇప్పటికీ నాకు గుర్తే. ఆ తర్వాత రోజు పాంచ జన్యం  అన్న నాటకాన్ని ప్రసారం చేసాం. దానిలో బందాగారి స్నేహితుడు, సహనటులు వేదిక పైన  బసవయ్య గారు  రంగస్థల నాటకాలు వారితో వేసేవారు. వారు మంచి వేణు విద్వాంసులు కూడా న్యాయవాద వృత్తి వల్ల బందా గారికి స్నేహం కుదిరింది వారి అబ్బాయి శివలెంక అమృత లింగ శాస్త్రి నా సహ పాటి. ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో బందా గారి నాటకాన్ని ప్రదర్శించింది మేమే. బందాగారు విపరీతంగా ఇష్టపడే నాటకం అనార్కలి  సినిమాలో దిలీప్ కుమార్ తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రకు జీవం పోశారు దానిని మించిన వారు ఎవరా అని ఆలోచించి చాలా ఆలస్యంగా నన్ను పిలిచి  బందా గారు నాతో ఒకటి  రెండు పేరాలు చదివించుకుని  ఆ వేషానికి
నన్ను ఎంపిక చేసి అక్బర్ గా డాక్టర్. సాంబశివరావు గారిని పిలిపించారు  వింజమూరు లక్ష్మి శ్రీరంగం గోపాల్ రత్నం గారు కూడా ఉన్నారు రామ్మోహన్ రావు గారికి మంచి వేషం  రామ్మోహన్ రావు గారికి ఒక అలవాటు ఉంది. ఎవరు డైలాగ్ చెప్పినా తన పద్ధతిలో చెప్పాలని. రంగస్థలం మీద కే. వెంకటేశ్వరరావుకి అలవాటు.  దానివల్ల మూస వేషాలు తయారవుతాయని ఊహించరు. నేను నాటకం చివరలో ఎంతో ఆవేదనతో బాధతో దాదాపు పేజీ  చెప్పాలి మధ్యలో ఆపి సూచన చేయబోయాడు  రామ్మోహన్ రావు. బందా గారికి కోపం వచ్చి రాము వాడి ఇష్టం వచ్చినట్లు చెప్పని వాది మూడు చెడ కొడుతావు  ఎందుకు అని అరిచారు.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం