తిరుప్పావై పాశురము : 21 ( తిరుప్పావై )- సి. మురళీమోహన్
 ఏత్తక్కలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్ 
ఆత్తప్పడైత్తాన్ మగనే! యఱివుఱాయ్;
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ 
తోత్తమాయ్ నిన్ఱశుడరే, తుయులెళాయ్;
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే 
పోత్తియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలో రెమ్బావాయ్
భావము :
          పొదుగుల క్రింద ఉంచిన కడవలు చర చర నిండి పొంగి పొరలునట్లు, ఆగక, ధారలుగా పాలు స్రవించు ఉదారములైన అసంఖ్యాకములైన బలిష్ఠములైన ధేనువులను కలిగిన నందగోపుని  కుమారుడా! శ్రీకృష్ణా! మేలుకొనుము! 
అత్యుత్తమఢవంతుడా! పరబ్రహ్మస్వరూపా! ఆశ్రిత రక్షణ ప్రతిజ్ఞా దృఢత్వము కల మహా మహిమాన్వితా! ఈ లోకములో ఉదయించిన జ్యోతిస్వరూపా! మేల్కొనుము! నీ రా క్రమమునకు  లొంగిన  శత్రువులు నీ వాకిట జేరి, నీ దాసులై , నీ పాదారవిందములను ఆశ్రయించినట్లు మేము కూడా నిన్ను విడిచి ఉండలేక, నీ పాదములనే స్తుతించి మంగళాశాసనములు చేయుటకు వచ్చితిమి!    
              శ్రీ వరాహస్వామి పరిపూర్ణ  కృపాకటాక్ష అనుగ్రహ  సిద్ధిరస్తు
సర్వేజనాస్సుఖినోభవంతు
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
శుభం భూయాత్

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం