నటనకు వ్యాకరణం- బందా గారు (22)-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 డా. సాంబశివరావు గారిది ప్రత్యేక బాణి. ఆయనకు దీటుగా డైలాగ్ చెప్పడం కష్టం  అయితే ఆయన పద్ధతి తెలిస్తే చాలా తేలిక. నువ్వొక్కడివే నా బాణీని అర్థం చేసుకున్న హీరోవి అని నన్ను అభినందించారు కూడా. దానివల్ల రామ్మోహన్ రావు మధ్యలో కలగ చేసుకోవడం తగ్గించాడు. దానిలో బందా గారు కూడా తాన్ సేన్ వేషం ద్వారా వచ్చారు. పాటలు పాడారు ఆ పాటలు నేటికీ శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. నాకు సంబంధించిన పాటలు, పద్యాలు వెంకటేశ్వర్లు గారు పాడారు. ఈ నాటకం ప్రారంభించడానికి ముందు విజయవాడలో మొఘల్ ఏ అసామ్  సినిమా ఆడుతుంది. బందాగారు ముందే నన్ను హెచ్చరించారు ఆ సినిమాకు వెళ్ళవద్దు చూడవద్దు అది చూస్తే  అతని బాణీ వింటావు  ఇది నీవు నిర్వహించవలసిన పాత్ర  నీ పద్ధతిలో నీవు నిర్వహించు అనే సలహా ఇచ్చారు  పాత్రలు తీర్చిదిద్దటంలో బందా గారి తర్వాతే ఎవరైనా రేడియోలో.
తరువాత కట్టబ్రహ్మన్న  నాటకంలో కూడా ఇలాంటి సందర్భమే. ఆ పాత్రను ఎన్నుకున్నప్పుడే బందాగారు చెప్పారు ఆ సినిమా చూడవద్దు అని  శివాజీ నటించిన నాటకంలో  శర్మ గారితో చెప్పించారు డబ్బింగ్.  నేను ఛైర్మన్ నాటకంలో శర్మ గారితో నటిస్తున్న సందర్భంలో వారన్నమాట  కట్ట బ్రహ్మన్నకు  నీ కంఠం అయితే శివాజీ గణేషన్ కు చక్కగా సరిపోయేది  నా కంఠంలో జీర ఉండడంతో పూర్తి జీవం రాలేదు అన్నారు. తర్వాత బందా రచించి నిర్వహించిన నాటకం  యాగశిల  అది పౌరాణిక నాటకం దాంట్లో నేను , లింగరాజు శర్మ పాల్గొన్నాం. రికార్డింగ్ అయిన తర్వాత  మీరిద్దరూ నచ్చారయ్యా  నాకు ఈసారి సాంఘిక నాటకం చేయిస్తాను మీ ఇద్దరితో అన్నారు. అన్న ప్రకారం నెలరోజుల్లోనే తల్లి కొడుకుల పేరుతో ఆయనే నాటకాన్ని వ్రాసి మా ఇద్దరిని అన్నదమ్ములుగా నాగరత్నమ్మ ను అమ్మగా మంచి సెంటిమెంట్ తో నాటకాన్ని నడిపారు. ఇకనుంచి నా గంట నాటకాలు అన్నిటిలో మీరిద్దరయ్యా నాకు హీరో, విలన్లు  అని చెప్పిన బందా గారు  వారు మరణించేంతవరకు ఆ మాటలను నిలబెట్టుకున్నారు.
ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలోని ప్రత్యేక బాణీతో వార్తలు చదివిన ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేసిన పరిచయ కార్యక్రమమైన 
వారే మంచి కంఠస్వరం ఆయన వ్రాసిన గ్రీన్స్ ఆఫ్ గుజరాత్  రూపకం మంచి పేరు తెచ్చుకోండి దానినీ వింజమూరు శివరమారావు గారు తెలుగులో అనువదించారు. దానిలో మెల్వెల్ డిమెల్లో పోషించిన పాత్ర  నాకు ఇచ్చారు బందా గారు  ఒక సందర్భంలో విజయవాడ వచ్చి  నాగార్జునసాగర్  రూపకం చేయడానికి రావడం  ఆయనకు బందా గారు నన్ను పరిచయం చేయడం ఆయన వేషాన్ని తాను వేశాడని వారికి గుర్తు చేసినప్పుడు నన్ను  చక్కగా అభినందించారు  జీవితంలో ఇలాంటి మరపురాని మధుర స్మృతులు ఎన్నో  స్మృతి పథంలో కదలాడుతూ ఉంటాయి.

కామెంట్‌లు