(శ్రీ శ్రీ శ్రీ త్రిదండి 66శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ప్రవచనం)
పాశురము:
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీళే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విళియావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎళిరన్దాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్
ఎంగళ్ మేల్ శాపం మిళం ద్-ఏలోర్ ఎమ్బావాయ్
మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుతూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ…
==========================
(గోదమ్మ ఆమెతో పాటీ
వచ్చిన గోపికలు
శ్రీకృష్ణుని నిద్రలేపి నందభవనములో తన సింహాసనముపై
కూర్చుని తమ కోరికను కటాక్షించవలెనని ఈ పాశురము ద్వారా వేడుకుంటున్నారు)
మారి మలై ముழఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్
శీరియ శిఙ్గమ్ అఱివుற்று త్తీవిழிత్తు
వేరి మయిర్ పొఙ్గ ఎప్పాడుమ్ పేర్ న్దుదఱి
మూరి నిమిర్ న్దు ముழఙ్గి పుఱప్పట్టు
పోదరుమాపోలే నీ పూవై ప్పూవణ్ణా
ఉన్ కోయిల్ నిన్ఱు యిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తు ఇరున్దు యామ్ వన్ద
కారియమ్ ఆరాయన్దరుళ్ ఏలో రెంబావాయ్!
ప్రతిపదార్థాలు:
మారి మలై ముழఞ్జిల్~ వర్షాకాలమున కొండ యొక్క గుహయందు;
మన్నిక్కిడన్దు ఉఱఙ్గుమ్~
స్థిరముగా పరుండి నిద్రించు;
శీరియ శింగమ్ అరివుற்று~
శౌర్యముగల సింహము
మేల్కొని;
తీవిழிత్తు వేరి మయిర్ పొఙ్గ ~
ఉగ్రముగా చూచి
పరిమళించు జూలు
నిగుడుగ;
ఎప్పాడుమ్ పేరున్దుదఱి~ అన్ని వైపులా
కెలి జూలు విదలించి;
మూరి నిమిరిన్దు ముழఙ్గి పురప్పట్టు ~
నిక్కి నీల్గి దేహమును
సారించి
గర్జించి బయలుదేరి సింహ గమనముతో;
పోదరు మాప్పోలే~
వచ్చునట్లు;
పూవై పూవణ్ణా ~
అవిసి పూవు వన్నె కాడా;
నీ ఉన్ కోయిల్ నిన్ఱు యిఙ్గనే~
నీవే నీ కోవెల నుండియే ఇక్కడికి;
పోన్దరుళి~
వేంచేసి మమ్ములను కటాక్షించుటకు!
కోప్పుడైయ శీరియ శిఙ్గాసనత్తు ఇరున్దు~
గొప్పదైన శ్రేష్టతమమైన
సింహాసనము మీద కూర్చుని;
యామ్ వన్ద కారియమ్ ~ మేము వచ్చిన కార్యమును;
ఆరాయన్దు అరుళేలో రెంబావాయ్~
తెలుసుకుని విచారించవలెను స్వామీ
భావము:
వానాకాలమున మృగరాజు కొండగుహలో చేరి నిర్భయముగా నిద్రించుచూ,
మేఘ గర్జనను సైపలేక
నిదుర మేల్కొని నిప్పులు
గ్రక్కుచూపులతో నిద్రాభంగ హేతువును బయట కలయజూచి, నిక్కి నీల్గి దేహమును
సారించి వేటకై వెలికి వెడలి ~ ఇతరమ్రుక్కిడి మృగముల లెక్కసేయని రీతి బయలుదేరి మహోన్నత ప్రదేశాన్నిఅధిష్టించిన
ఆసీనమైన పగిది ~
నందకిశోరమా!
లేచి నిద్రమజ్జు
తొలగునట్లు ఒడలు
విరుచుకుని,స్వభావముగా కెందామరలను పోలిన
కనుగవతో
కెంపులూరుచూపులను మా అందరిపై ప్రసరింపజేయుమా!
నీ సౌందర్యమును
సేవించుకొనుభాగ్యాన్ని మా అందరికీ కూడా కలుగనీయవయ్యా కన్నయ్యా!
వ్యాఖ్య:
ఇక్కడ వర్షమనగా
భగవత్కృపాసముద్రము నుండీ కారుణ్యమనెడు
వాయువుచేకదలబడిన
నీటికెరటముల నుండీ
బయలివెడలిన
భగవత్కటాక్ష ప్రసరణము.
గుహ అనగా వేద గుహ.
శీరియసింగమనగా లక్ధ్మీ
సహిత నారాయణుడు.
దీని
భావమే ~
ధర్మస్య తత్వం నిహితం గుహాయాం
అను శృతిచే చెప్పబడినది. సింహము మేల్కొనుట అంటే చేతనులను వారి వారి కర్మాణుగుణముగా
శరీరములను సృజించి అందు చేర్చుటకు తగిన సమయము వచ్చినదని గుర్తించుట; ఇదే కారణ తత్వములోని మొదటి స్పందనము. ఇదే మేల్కొనుట ఆశ్రిత రక్షణావసరమును
గుర్తించుటచూచుట అనగా సృష్టికి
సంకల్పించుట.
ఐక్షత బహుస్యాం ప్రజాయేయ అనేది శృతివాక్యము.
ఇట్లుసంకల్పించగానే తేజస్సు ~ దానినుండీ జలము పృధివి ఆవిర్భవిస్తాయి. అందుకే
తీవిళిత్తు వేరిమయిర్ పొంగ
అని చెప్పబడింది.
సృష్టిక్రమ వికాసమే ఎప్పాడుంపేరుందరి మూతినిమిరిందు అని అన్వయము.
పరతత్వము
కారణావస్థను వదలి
కార్యావస్థను ~ అనగా
జగద్రూపమునందునపుడు ప్రకృతి రూపుగావించిన
పరమాత్మ శరీరములో
కలిగెడి మార్పులను
ముళంగి పురప్పట్టు పోదరుమాపోలే అని చెప్పబడినది. కార్యావస్థనొందిన పరమాత్మలోని సౌలభ్యమే
అతసీ పుష్ప
సంచాయ
ఇక్కడ
కోయిల్
అంటే ప్రణవము. ఇదే పరమాత్మకు జీవాత్మ అగు ఆచార్యునకు నివాసము.
విభూతి అంటే పరమాత్మ సింహాసనము.
అనువాద సీస పద్యము:
(కీ. శే. కుంటిమద్ది శేషశర్మ గారు)
వానల కాలాన పర్వత గుహలోన
నెమ్మది సింగంబు నిద్రగూరి
మేల్కని కనువిచ్చి మురుమిట్లు గొల్పు చూ
పుల నెల్ల దిక్కుల గలయజూచి
మెయి నిక్కగదలించి మెడజూలు విదలించి
గర్జించి వెడలంగ గడగినట్లు
పడకటింటిని వీడి పంచాస్యగతితోడ
నరుదెంచి మేలి సింహాసనమున
అవిసి పూవన్నె తిరుమేనియందగా
కొలువుదీరుము; వచ్చిన గోపకన్ని
యల కోరిక లవధరించి నీవు
కరుణింపు మమ్ము సింహావలగ్న!
(ఆణ్డాళ్ దివ్య తిరువడిగళే శరణమ్)
🌹🌹🌹🌹🌹🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి