ప్రతినబూనుదాం! (జనవరి 26) ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
తెలతెల వారెను సోదరా
గణతంత్ర దినమూ నేడెరా
స్వతంత్ర భారతి నీదేరా
ప్రభాత గీతిక పాడరా 
!! తెల!!
 సోమరియై ఇక పరుండకు 
జగతిన మనకే దిగ్విజయం 
భయములేదిక మన రాజ్యం
భారతదేశం జయం జయం 
!!తెల!!
పరాయి పాలన అంతమొందగా
మన పరిపాలన మొదలాయె
భారత ప్రజలకె ముదమాయె 
భారతాంబయే మరి నవ్వె 
!!తెల!!
మన రాజ్యాంగం మనకు దివ్యమై వెలుగొంద
జనుల కెల్లరకు ఆమోదంబై అది విలసిల్ల 
భారత భారతి నుదుటి సింధూరమై అది
భాసింప
ఈ దివ్య దినమున ప్రతినబూనుదాం మనమంతా 
!!తెల!!
*********************************


కామెంట్‌లు