విజయ లక్ష్మి రంగస్థలం మీద అన్ని రకాల పాత్రలను పోషించారు మా రత్న బోసు తో అనేక నాటకాలలో నటించింది. నేను కోకా సంజీవరావు ఇందులో నీవా నేనా అన్నంతగా పోటాపోటీగా నటించాం మాతో పాటు మా అందరికీ స్నేహితుడు కుటుంబ సభ్యులలా ఉండే కందుకూరి చిరంజీవి రావు గారు నాటకానికి జీవం పోశారు. చివర సీతారత్నమ్మగారు ఆమె ప్రత్యేక బాణీతో మా అందరినీ కనిపించకుండా చేసింది. ఆనాడు కుటుంబరావు గారితో చేసిన నాటకం నాటికి నేడులో ఎంత అద్భుతంగా తన పాత్రను పోషించిందో ఈ నాటకంలో అంతకుమించి గొప్పగా నటించింది. మాతో పాటు నండూరి సుబ్బారావు గారు, పాండురంగ పాల్గొన్నారు. ఈ నాటకం విజయం పొందడంతో బందా గారు చాలా ఆనందించారు.
ఎత్తు పల్లాలు నాటకంలో నాతోపాటు నాగరత్నమ్మ పాండురంగ వి బి కనకదుర్గ వింజమూరి సరస్వతి పాల్గొన్నారు జీవిత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదు బాధలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు అన్న నీతిని చెప్పడం కోసం చక్కటి ఇతివృత్తంతో కూడిన నాటకం ఇది తరువాత సీత నడిచిన దేశం అన్న నాటకాన్ని పౌరాణిక సంఘటనలను తీసుకొని సాంఘికంగా నేటి సమాజానికి అన్వయించి చెప్పాడు రచయిత. ఈ నాటకంలో ప్రథమంగా ప్రయాగ వేదవతి నటించింది అంతవరకు చిన్నపిల్లల కార్యక్రమంలో కంపీర్ గా పని చేస్తూ అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో ఉత్సాహంతో ఈ నాటకంలో కావాలని మా అందరి మధ్య పాల్గొన్నది లింగరాజు శర్మ గారు ప్రతి నాయకుడిగా హనుమంతరావు కృష్ణ మాడుగుల రామకృష్ణ కూడా ఉన్నారు. మాడుగుల రామకృష్ణ కూడా అప్పటికి నాటకాలలో నటించడం చాలా తక్కువ. చిన్న నాటకాలు అయితే బందా గారే రాసి నిర్వహిస్తారు. మంచి పేరు కలిగిన నాటక రచయితలను పిలిచి తాను అనుకున్న అంశాన్ని చెప్పి దానిని సరళంగా వ్రాయమని కోరుతారు ఆ నాటక ప్రతి వచ్చిన తర్వాత ఆయన చదివి చేర్పులు మార్పులు చేసి దానికి కావలసిన సరిపడిన నటులను ఎంపిక చేసి వారంతా వచ్చిన తర్వాత కూర్చోబెట్టి తాను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చదవడం ప్రారంభిస్తారు. అందరికీ అన్ని పాత్రలు అర్థమవుతాయి అప్పుడు ఎవరు ఏ పాత్ర ధరించాలో దానిని వారికి చెప్పి నాటక ప్రతినిచ్చి
ఆ పాత్ర స్వరూపస్వభావాలను విడమర్చి చెప్పి వారు పూర్తిగా నాటకం మొత్తం ప్రారంభించిన తర్వాత సాధన చేయడానికి ఉపక్రమిస్తారు అది బందా గారి పద్ధతి ఆయన వచ్చేంతవరకు ఈ విధానం ఎవరికీ తెలియదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి