వారు చదవడం ప్రారంభించక ముందే మీరు చదివే పాత్ర నాకు నచ్చకపోతే ఆ వేషాలను మార్చవలసి వస్తే మారుస్తాను మీరు ఎవరు ఏమీ అనుకోవద్దు అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా తన ప్రతిభను చూపడానికి ప్రయత్నం చేసేవారు. అలా ఒకటి రెండు సందర్భాలలో ఆ పాత్రలను మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బందాగారు ముందే చెప్పి ఉండడంతో ఎవరు దానిని పట్టించుకునే వారు కాదు ఎన్.సి.వి జగన్నాథాచార్యులు గారి కుమార్తె సీత చాలా చిన్నతనంలోనే సంగీతాన్ని నేర్చుకున్నది మా నాటకాలను కార్యక్రమాలను వింటూ దానిలో తప్పులను కూడా చెప్పగలిగినదిట్ట మనసులో ఏదీ దాచుకోకుండా ఏమైనా తప్పు జరిగినప్పుడు వారి నాన్నగారితో మాకు కబురు చేసేది అంత సంస్కారవతి. అలాంటి బంగారు తల్లి బేబీ సీత డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని విబి కనకదుర్గ శ్రీరంగం గోపాలపట్నం ఎం నాగరత్నమ్మ సీతారత్నమ్మ ఎం వాసుదేవ మూర్తి సి రామ్మోహన్ రావు నండూరి సుబ్బారావు గారితో కలిసి వేసిన నాటకం దానిలో నాకు కుమార్తె వేషం ఆమెకు తండ్రిగా నటించే అవకాశం భగవంతుడే కల్పించాడు అనుకున్నాను. ఆకాశవాణికి అద్భుతమైన బాల కళాకారిణి దొరికింది అని ఎంతో ఆనందపడిపోయాం. ప్రత్యేకించి బందా కనక లింగేశ్వర రావు గారు ఈమెను ముద్దు చేసి ఒడిలో కూర్చొ పెట్టుకున్నారు కూడా. అలాంటి తల్లి మా అందరిని ప్రత్యేకించి తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచి అతి చిన్న వయసులోనే భౌతికంగా దూరం కావడం మొదటిసారిగా జీవితంలో నేను కన్నీరు కార్చిన సందర్భం. భగవంతుడు తెలివైన వాళ్లను, మంచివారిని ముందుగా తీసుకెళ్ళిపోతాడేమో అని నా అనుమానం. బందా గారు నాటకాన్ని అంగీకరించ డానికి ముందు శ్రోతలకు ఏ విషయాన్ని చెప్పాలి అన్న విషయాన్ని సమగ్రంగా ఆలోచించి దానిని ఏ ప్రాంతీయం లో చెప్తే బాగుంటుంది ఇటు కృష్ణా గుంటూరు అటు శ్రీకాకుళం విజయనగరం ఇటు నెల్లూరు ప్రాంతం ఏది బాగుంటుంది అనేది నిర్ణయించి దానికి సంబంధించిన కథను అల్లి ఆ ప్రాంతీయ భాషను వ్రాసే నేర్పరులు ఎవరు ఉన్నారో చూసి వారిని పిలిచి విషయం మొత్తం సమగ్రంగా చెప్పి ఒక దానికి మరొక దానికి సంబంధం లేకుండా పాత్రోచిత సంభాషణలతో నాటకాన్ని రాయమన్నప్పుడు రచయితకు కూడా దేనిని గురించి ఎలా రాయాలో అర్థమవుతుంది ఐదు ఆరు రోజుల్లో ఆ నాటకం తన చేతికి వస్తుంది బందా గారు చదివి ఏ వేషాన్ని ఆ ప్రాంతీయ పద్ధతిలో చదవగలిగిన సమర్థవంతమైన నటుడు ఎవరు అని ఆలోచించి వారికి కబురు చేసి నాటకం తయారు చేస్తారు ఒక నాటకం తయారు కావడానికి దాని వెనుక అంత కృషి ఉంది.
నటనకు వ్యాకరణం బందా గారు (31);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి