నటనకు వ్యాకరణం బందా గారు (32);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 1963  ఆగస్టులో నాకు  అప్పటివరకు  కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న  నన్ను  నేరుగా కళాకారునిగా ఎన్నిక చేయడం కోసం  నాకు సంబంధించిన వివరాలన్నిటిని ఇవ్వమని అధికారులు  అడిగారు  నా ఎస్ ఎస్ ఎల్ సి  పుస్తకం చూపిస్తే నా అసలు పేరు తెలుస్తుంది  నేను పరిష్కారం కోసం గురువుగారు నండూరి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్లి  చెప్పగానే  దానికంత ఆలోచన దేనికి మన లాయర్ గారు ఉన్నారు కదా బందా కనక లింగేశ్వర రావు గారు  వారి దగ్గరికి వెళితే  క్షణకాలంలో ఈ  సమస్యకు పరిష్కారం  జరుగుతుందని చెప్పి వారి దగ్గరికి తీసుకొని వెళ్లి విషయం మొత్తం చెప్పారు  నాన్న చాలా మంచి పని చేశావు  నన్ను కలవకుండా ఈ పుస్తకం ఆఫీస్ కి ఇస్తే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడిని  ఆ పేరుతో ఉన్న వ్యక్తిని హత్య చేసి నీవు అతని పేరుతో ఇక్కడ చలామణి అవుతున్నావు  అని వారు నీ మీద  అభియోగం చేసే  అవకాశం ఉంది అని చెప్పి
నన్ను సుబ్బారావు గారిని  ముందు మీరు హైదరాబాదు వెళ్లి ఆఫీసులో  పేరు మార్చుకుంటున్న విషయాన్ని గురించి మాట్లాడండి  కొంత డబ్బు కట్టవలసి వస్తుంది కట్టిన తర్వాత  ఆ రసీదు నంబర్ తీసుకొని ఒక పత్రికలో  ప్రకటన ఇవ్వండి  ఫలానా పేరుతో నేను వ్యవహరించడానికి  అనుమతి తీసుకున్న విషయాల గురించి  పత్రికలో ఆ ప్రకటన వచ్చిన నెల రోజుల తరువాత  ఆ కాగితాలతో  మన సంచాలకులకు  చెప్పి  ఆ కాగితాలను ఇస్తే  అప్పుడు నీకు ఉద్యోగం ఖాయం అవుతుంది  ఆ రాత్రికి హైదరాబాద్ వెళ్లి అక్కడ పని అంతా పూర్తి చేసుకుని  తిరిగి వచ్చాం  అలా నాకు ఆకాశవాణిలో ఉన్న ప్రతి వ్యక్తి  తమ సహాయ సహకారాలు అందించడం వల్ల  నేను ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా అందరి అభిమానాన్ని చొరగొన్నాను  నేను ఉద్యోగ 
విరమణ చేసిన ఈ నాటికి నాకు కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నారు  ఆకాశవాణి కేంద్రం వారు. హాస్యభరితమైన నాటకాలు రాయడానికి  ప్రధమ స్థానం ఇస్తారు బందా గారు. ఒకరు నెల్లూరు నుంచి వచ్చినవారు  ఒకరు తెలంగాణ నుంచి మరొకరు ఆంధ్రా నుంచి  శివయ్య శ్రీ శ్రీకాకుళం నుంచి  వచ్చిన పాత్రలను ఒకచోట కలిపి  అన్ని ప్రాంతీయ భాషలను మన ముందుంచి  ఒకరి మాటల అర్థాన్ని మరొక  ప్రాంతీయ వారు మరొక  రకంగా అర్థం చేసుకొని వారి పరిభాషలో చెప్పించడం వల్ల పొంతన లేకుండా ఉండడం  దానివల్ల చక్కటి రసోత్పత్తి కలిగి వినే శ్రోతకు నవ్వు ఆగదు  అలాంటి ప్రయోగాలు చేయడంలోబందా గారు దిట్ట  ఆ పాత్రలను  నండూరి సుబ్బారావు, సండూరు వెంకటేశ్వర్లు  నేను  పావలా శ్యామల లాంటి వాళ్ళని పిలిచి  దానికి తగినట్లుగా చెప్పించి హాస్యాన్ని  అందించడం మరొక రకమైన నాటక ప్రక్రియ.

కామెంట్‌లు