బందా గారు నన్ను కథానాయకునిగా ఎన్నుకున్నప్పుడు నా స్నేహితుడు రత్న బోస్ ను గానీ, ఎన్ వెంకయ్యను కానీ ఎన్నిక చేయరు. నటులు బాగా చొరవగా ఉన్నవాళ్లు కలిసి చేస్తే ఆ నాటకానికి జీవం వస్తుంది నండూరి సుబ్బారావు గారు సి రామ మోహన్ రావు గారు ఏరా అనుకునే స్నేహితులు కనుక వారు చేస్తున్న బావగారి కబుర్లు అద్భుతంగా శ్రోతలను అలరిస్తాయి. ఇప్పుడు మేం కలిసి చేస్తే మా ముగ్గురి కంఠాలు ఒక మాదిరిగానే ఉంటాయి కనుక ఎవరు ఏ పాత్ర ధరిస్తున్నారో వినే శ్రోతకు అర్థం కాదు. ఇది దృశ్య నాటకం కాదు కదా కనక అలాంటి ఏర్పాటు చేయరు బందా గారు బాగా ఆలోచించే శ్రోతను దృష్టిలో పెట్టుకొని ఆ తరువాతనే మిగిలిన ఎన్నిక మొత్తం జరుగుతుంది అదే వారిమేథో సంపత్తి.
నాటకాన్ని సాధన చేయించే పద్ధతి కూడా బందా గారిది ప్రత్యేక పద్ధతి అందరినీ చుట్టూ కూర్చోబెట్టి మైకు మధ్యలో ఉన్నట్లుగా భావించి ఎదుటి వారి మాటకు తాను ఎలా సమాధానం చెప్పాలో చెప్పేటప్పుడు ఆ మైకు ఎంత దూరంలో ఉండాలో అనేది ఇక్కడే చెబుతారు వారు అలా శిక్షణ ఇవ్వడం వల్ల అవతలవారు ఏ శృతిలో చెప్పాలో అలా చెపుతున్నారో ఇవతల వారు కూడా అదే శృతిలో చెప్పాలి అన్న విషయం ఆ నటునికి అర్థమవుతుంది. చిన్న చిన్న మాటలు వరుసగా ముగ్గురు నలుగురు చెప్పవలసిన సందర్భంలో కూడా ఆ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతకు ముందు నాటకాలను అలా చేసిన వారు లేరు బందా గారు చేసిన నాటకానికి సంబంధించిన కృషి మరి ఎవరు చేయలేదు ఇంతవరకు వారు చేసిన నాటకాలను మించి గొప్ప నాటకం ఏ ఒక్కటి ప్రసారం కాలేదు అన్న విషయం శ్రోతలందరికీ తెలుసు.
బందా గారి లాంటి మానవత్వం ఉన్న మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు జీవితంలో చితికిపోయిన వారిని గమనించి వారిని పిలిచి ఆడిషన్ పెట్టి ఎన్నిక చేసి అప్పుడప్పుడు వారిని పిలుస్తూ ఆర్థిక సహాయం చేసేవారు నేను ఒక రోజు ధైర్యం చేసి గురువుగారూ అని అడిగాను. అయ్యా అతనికి చిత్తం అనడం కూడా రాదు కదా ఎందుకు పదేపదే అతన్ని పిలుస్తున్నారు అంటే చిరునవ్వు నవ్వారు తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు నేను మళ్ళీ అడగలేదు ఒకరోజు ఓ లేటి వెంకటేశ్వర్లు గారి అమ్మాయి వివాహానికి కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో జరుగుతున్న దానికి హాజరై తిరిగి వచ్చేటప్పుడు కింద ఒక చిన్న పూరిపాకలో ఒక గృహిణి ని కలవడం కోసం ఆయన వెళుతుంటే నేను కూడా ప్రక్కనే వెళ్లాను. రండి అన్నయ్యగారు అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది ఆవిడ.
నటనకు వ్యాకరణం- బందా గారు (33)-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి