ఆ బీద వారి ఇంట్లో కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు చిరిగిన చాప ఒకటి వేసి అన్నయ్యగారు కూర్చోండి బాబు మీరు కూడా కూర్చోండి అని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కాదమ్మా వేరే పని ఉంది ఈసారి వస్తాం. శర్మ ఎక్కడికి వెళ్లాడు అంటే బజారు వెళ్లారు అన్నయ్య గారు రాగానే మీరు వచ్చారని చెబుతాను అంటూ చిరిగిన జాకెట్టు భాగం మాకు కనిపించకుండా ఉండడం కోసం చిరిగిన చీరతో కప్పుకోవడానికి ప్రయత్నం చేసిన దృశ్యం నాకు కన్నీరు తెప్పించింది ఆనందా ఇప్పుడు మనం ఎవరి ఇంటికి వచ్చామో తెలుసుగా తరచుగా తనను పిలుస్తూ ఉంటారు అని నీవు అడిగావే అతని గురించి ఆమె భార్య ను చూశావు కదా ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది కదా అనేసరికి దుఃఖాన్ని ఆపుకోలేక వారిని కౌగిలించుకొని భోరున ఏడ్చిన సంఘటన ఈనాటికి నాకు గుర్తు.
ఈ జన్మలో గురు శిష్యుల సంబంధం సంచిత జన్మ ఫలం అని అనిపిస్తుంది నా అనుభవాలలో నాకు తెలిసిన విషయమని అది ఒక్కొక్క గురువు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా తీర్చి దిద్దుతారు ఒక్కో గురువుగారికి ఒక్కొక్క పద్ధతి నండూరి సుబ్బారావు గారు చెప్పేది ఒక రకంగా ఉంటుంది బందా కనక లింగేశ్వర గారు చెప్పేది మరో రకంగా ఉంటుంది మా వేదాంతి డాక్టర్ వెంకట రాజు గారు చెప్పింది అయితే ఆధ్యాత్మిక విషయాన్ని జోడించి జీవిత సత్యాన్ని శాస్త్రీయంగా చెబుతారు మా గురువుగారు నండూరి సుబ్బారావు గారు పొదుపు గురించి వారు నోటితో చెప్పకుండా తాను చేసి చూపిస్తారు తప్ప దానిని నీవు కూడా ఇలాగే చెయ్ అని ఒక పాఠం చెప్పినట్లు చెప్పరు అది వారు అవలంబించే పద్ధతి. నాకు కూడా అదే ఆచరణీయమేమో అనిపిస్తుంది నేర్చుకునే వాడిని నేనే కనుక. ఆకాశవాణికి బయటనుంచి వచ్చే కళాకారులు ఎక్కువగా రంగస్థల నటులు ఇద్దరు ముగ్గురు సినీ రంగంలో ప్రవేశించిన చిన్న చిన్న వేషగాళ్లు వారికి ఆ మాధ్యమాలలో మంచి అనుభవం ఉంటుంది కానీ ఆకాశవాణి మాధ్యమం వాళ్లకు తెలియాలి అంటే బందాగారి లాంటి వాళ్ళ శిష్య రికం తప్పనిసరి. వేదిక పైన నటించేవారు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మొదటి వరుస నుంచి చివరి వరస వరకు అందరికీ వినిపించేలా ఒకే శృతిలో చెప్పడానికి అలవాటు పడి ఉంటారు. అలాగే సినీ రంగ ప్రవేశం ఉన్న వాళ్ళు కెమెరాని దృష్టిలో పెట్టుకుని చేస్తారు ఇక్కడ మైకును దృష్టిలో పెట్టుకుని చేస్తే తప్ప శృతి తగ్గించినప్పుడు ఎంత దూరంలో ఉండాలి హెచ్చించినప్పుడు ఎంత దూరంలో ఉండాలి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఆ వేషానికి న్యాయం జరగదు అని దాని గురించిన విషయాలు వారికి తెలియ చెప్పడం బందా గారికి అలవాటు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి