నటనకు వ్యాకరణం- బందా గారు (35) -ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

బందా గారు చక్కటి హాస్య ప్రియుడు  కొన్ని కార్యక్రమాల్లో  పెద్ద నటీనటులు వచ్చినా  ఏమైనా కొత్త నాటకాలు  తయారుచేసినా బృందంగా  ఫోటోలు దిగటం వాటిని  ఆకాశవాణి పక్ష పత్రిక వాణి లో ప్రచురించడం జరుగుతూ ఉంటుంది  అలాంటి సమయంలో కూడా బందరు  మొదటిసారి ఫోటో దిగినప్పుడు  ఆనంద్ నువ్వు నా కథ నాయకుడివి నా ప్రక్కన నిలబడు  అని తన ప్రక్కన నలబెట్టుకొని ఫోటోలు  దిగేవాడు  రెండవపర్యాయం మరో ఫోటో దిగవలసిన సందర్భం వస్తే  అక్కడ మీ అన్నగారు ఉన్నారు కదా ఆయన ప్రక్కన నిలబడును  అనేవారు. మూడోసారి మీ కమల కుమారి అక్కయ్య మధ్యలో నిలబడి ఉంది కదా  ఆవిడ పక్కకు వెళ్లినిలబడు  అని చెప్పేవారు. నాటకీయత తెలిసిన వారు మాత్రమే  అలా ప్రవర్తించ గలిగిన కళాత్మక హృదయం కలిగిన వారు.
విశాఖపట్నం  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న చాట్ల శ్రీరాములు గారు  నాటక శాఖలో ఉండి  అనేక రంగస్థల నాటకాలను  ప్రదర్శించే ఏర్పాటు చేసేవాడు  విశ్వవిద్యాలయం వారు  ఒక సందర్భంలో లండన్ పంపించి  మన భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టిన నాటకాలను గురించి  మాట్లాడడానికి ఆ కొడుకు పంపించారు  అక్కడ మాట్లాడిన ప్రతివారు లండన్ థియేటర్ నుంచి వచ్చిన నాటకాలు తప్ప ప్రపంచంలో ఏవి నిలవలేదు  లండన్ నాటకాలకు పెట్టింది పేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు  అప్పుడు చాట్ల శ్రీ రాములు గారు  అసలు నాటకం అనే శబ్దానికి అర్థం తెలియని రోజుల్లోనే  భారతదేశంలో వీధి నాటకాలు ప్రారంభమైనాయి  అని ఈ థియేటర్ వారికి తెలియకపోవచ్చు  దశవిధ రూపకాలను  అద్భుతంగా భారతదేశంలో ప్రదర్శించినట్లుగా మరి ఏ దేశంలోనూ ప్రదర్శించలేదు  అంటూ ఏ సంవత్సరంలో ఎక్కడ ఎలాంటి నాటకాలు ప్రదర్శించబడ్డాయో  వాటిలో ఉన్న భేదాలు ఏమిటో అందరికీ తెలివి చెప్పినవాడు చాట్ల శ్రీరాములు గారు.
చాట్ల శ్రీరాములు గారు రంగస్థలప్రవేశం చేయడానికి ముందే  మూడు దశాబ్దాల క్రితం  రష్యా వెళ్లి  అక్కడ నాటక ప్రక్రియ బాలే చూసిన తర్వాత  అసలు నాటకం పుట్టుపూర్వోత్తరాలను గురించి  పల్లెల్లో  చిన్న చిన్న దుప్పట్లు కట్టి  నాలుగు బెంచీలు వేసి  పెట్రోల్ మాక్స్ లైట్ లతో  మైకులు లేకుండా  నాటకాలు ఆడిన స్థితి నుంచి నేటి వరకు నాటక  శాఖలో జరిగిన అనేక మార్పులను  వివరించుకుంటూ  ఏ నాటక పద్ధతి ఎలా ఉంటుందో సాంఘికంగా చేసే పద్ధతి వేరు పౌరాణికం చేసే పద్ధతి వేరు  చారిత్రక నాటకాలను  ప్రదర్శించడం అంత తేలికైన విషయం కాదు  ఆనాటి భాష తెలిసి ఉండాలి  రాజుగారు ఎలా మాట్లాడుతారు  మంత్రి పద్ధతి ఎలా ఉండాలి సైనికుడు ఎలా ప్రవర్తించాలి అన్న  ప్రతి విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పిన వారు బందా కనక లింగేశ్వర రావు గారు.
 
కామెంట్‌లు