ఒక పర్యాయం బందా కనకలింగేశ్వరరావు గారు బళ్లారి వారితో లండన్ వెళ్లి షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఒకరోజు క్వీన్ ఎలిజిబెత్ ప్యాలెస్ ముందుగా వెళ్లడం జరిగినప్పుడు అక్కడ ఒక కుక్క మొరగడం దానిని మరల్చడానికి బళ్లారి వారు అక్కడ ఉండి అక్కడ లేని రాయిని తీసినట్లుగా నటిస్తూ ఆ రాతిని ఆ కుక్క మీదకు విసిరిన సందర్భంగా ఆ కుక్క లోపలికి పారిపోవడం పైనుంచి ఈ దృశ్యాన్ని చూసిన క్వీన్ వారిని పైకి ఆహ్వానించి ఒక దృశ్యాన్ని ప్రదర్శించమని కోరి ప్రదర్శించిన తర్వాత వీరిని అందరిని ఆమె సన్మానం చేసిన విషయం చాలామందికి తెలియదు. బళ్లారి వారి బృందం అద్భుతంగా నాటకాలను ప్రదర్శిస్తుంది అన్న విషయం జార్జ్ బెర్ నాడ్ షా చెవిన పడి వారిని ఆహ్వానించాడు. భారతదేశం నుంచి వచ్చిన మీరు ఆంగ్ల నాటకాలు ప్రదర్శించడం అందులో షేక్స్పియర్ నాటకాలు ఫోర్ గ్రేట్ ట్రాజెడీస్ ఆడటం చాలా వింతగా ఉంది నాటకం చేయడమే కాక మీకు విషాదాంత నాటకాలను కూడా ప్రదర్శించే ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. కింగ్ లీయర్ బెడ్ సీన్ 2 నిమిషాలు నటించి చూపించమన్నారు బళ్ళారి రాఘవాచారి గారికి కొంచెం కోపం వచ్చింది కానీ ఆ కోపాన్ని కనిపించనీయకుండా దాచుకొని మేము భారతీయులం మాకు మీ భాష రావడమే అబ్బరం అందునా షేక్స్పియర్ నాటకాలు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయటం కూడా మా లోపం కావచ్చు నేను మీరు అడిగిన నాటకాన్ని ప్రదర్శిస్తే మీకు సంతృప్తి ఉండకపోవచ్చు భారత దేశంలో మేము ప్రత్యేకంగా ప్రపంచానికి నాటక కళను తెలియజేసినది నా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం.
మేము ప్రదర్శించిన ఆ కళలో ఒక భాగం భక్త ప్రహ్లాద దానిలో ఒక అంశం మీకు వినిపిస్తాను కాదు చూపిస్తాను అని తాను నటించబోయే దృశ్యాన్ని వారికి ముందే చెప్పారు నాస్తికుడైన తండ్రికి భక్తుడైన కుమారుడు భగవత్ దర్శనం చేయించినప్పుడు ఆ రాక్షసుడు ఎలాంటి అభినయం చేస్తాడో మీ కళ్ళారా చూడండి అంటూ ఒక కంటి ద్వారా కన్నీటిని కారుస్తూ మరో కంటి ద్వారా నిప్పు కణాలను విరజిమ్ముతూ ఎర్రగా సగం ముఖాన్ని జాలిగా దయగా భక్తి ప్రపత్తులతో వున్న ముఖం మరోసగాన్ని వాచకం లేకుండా ప్రదర్శించిన అభినయం చూసి బెర్నాడ్ షా అభినందిస్తూ ప్రపంచంలో నాటక
చరిత్రలో ద్వితీయ స్థానం నీదే అని ప్రశంసించడం భారత దేశ నట సామ్రాజ్యానికి గౌరవం (ప్రథమ స్థానం ది రెక్ సినిమాలో నటించిన కథా నాయకుడిది) అలాంటి బళ్ళారి రాఘవాచార్యుల గారి వద్ద శిష్యరికం చేసి వారి ప్రశంసలను పొందిన వారు మా బందా కనక లింగేశ్వర రావు గారు. నేటికీ వారి శిష్యులమని చెప్పుకోవడం మాకు ఎంత గర్వకారణమో చెప్పడానికి మాటలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి