పుస్తక పరిజ్ఞానంతో కాక అనుభవ జ్ఞానంతో గురువుగారు బళ్లారి గారి ఆశీస్సులతో నాటక రంగాన్ని ఒక కళగా ఆరాధిస్తూ జీవితాన్ని ఆ కళకే అంకితం చేసిన మహానుభావుడు బందా కనక లింగేశ్వర రావు గారు. ఒక నాటికను కానీ నాటకాన్ని ఎన్నిక చేయడం దానికి నటీనటులను ఎవరిని ఏ పద్ధతిలో ఎన్నుకోవాలి అని ధర్మ సూక్ష్మాన్ని ఒకరోజు తెలియజేశారు బందా గారు మంచి రచయిత దొరికి అతను ఉన్నతమైన పాత్రలను సృష్టించినట్లయితే వాటిని ప్రదర్శించడానికి గొప్ప నటుడు అవసరం లేదు సాదాసీదా నటుడు మన ఆకాశవాణి పరిభాషలో బి, బి హై నటీ నటులు కూడా సరిపోతారు. అదే పాత్రలు బలహీనంగా ఉన్నవి అయితే రచయితను బ్రతికించడం కోసం మంచి నటీనటుల ఎన్నిక జరగవలసిన వస్తుంది అని చెప్పిన విషయాన్ని ఒక సందర్భంలో బి.యన్ రెడ్డి గారికి కె.వి రెడ్డి గారికి కూడా సలహాలను ఇవ్వగలిగిన సత్తా కలిగిన వ్యక్తి ముదిగొండ లింగమూర్తిగారు వారు నాటకాలను వ్రాయడమే గాక ప్రదర్శనలలో కూడా ఉత్తమ నటునిగా ఎన్నికైన సందర్భాలు అనేకం ప్రత్యేకించి వెంకన్న కాపురం తాను రాసి తానే నిర్వహించి తానే నటించిన అద్భుత నాటక రాజం సినిమాలలో గొప్ప నటునిగా పేరుపొందినా జీవితమంతా నాటకానికి అంకితం చేసిన నటునికి ఈ విషయం చెబితే చిరంజీవీ (అందరినీ అలాగే పిలుస్తాడు ఆయన ) నాటక కళను ఆపోసన పట్టిన వాడు మీ బందా కనక లింగేశ్వర రావు గారు ఆయన చెప్పిన ప్రతి అక్షరము శిలాశాసనం ఆయనకు ఉన్న జ్ఞానాన్ని మించిన జ్ఞానం మరొకరికి లేదు నీవు మాట్లాడుతున్న ప్రతి వాక్యం ఆ బందాగారు పెట్టిన బిక్ష. అలాంటి గురువు నీకు దొరకడం నీ సంచిత జన్మ ఫలితం అనడాన్ని మించిన బహుమతి ఈ ప్రపంచంలో మరి ఏదైనా ఉంటుందా పరోక్షంగా కూడా బందా గారు అలాంటి పెద్దల అభిమానాన్ని పొందినవాడు ఒక శిష్యుడు గురువును వెతుక్కుంటూ వెళ్లారని ఒక గురువు శిష్యుని వెతుక్కుంటూ వస్తాడని కొంతమంది వేదాంతులు చెబుతూ ఉంటారు ఇది రామకృష్ణ పరమహంస వివేకానంద జీవిత చరిత్ర కు సంబంధించిన వాక్యం సాక్షాత్తు రామకృష్ణ పరమహంస భార్య శారదా అమ్మవారు చెప్పిన మాట మరి శిష్యుడిగా బందాగారి ఆదరణకు నోచుకున్న నేను ఎంత అదృష్టవంతుణ్ణి నిజానికి ఈ పుణ్యమంతా మా గురువుగారు నండూరి సుబ్బారావు గారికి దక్కుతుంది అందుకు సర్వదా వారిద్దరికి నేను కృతజ్ఞుణ్ణి.
బందా కనక లింగేశ్వర రావు గారికి నచ్చిన ప్రదేశం లండన్ అక్కడ వాతావరణం ప్రజల స్థితిగతులు అన్నీ భారత దేశంలో ఉన్న పల్లె ప్రాంతాలకు సమానంగా ఉంటాయి అయితే అక్కడ ప్రతి ఇంటికి అన్ని సదుపాయాలు అమర్చి ఉంటాయి పట్టణాలలో నగరాలలో ఎలాంటి వీధులు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో వాహనాల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చక్కటి నియమ నిబంధనలకు బందీలవుతారు అక్కడి ప్రజలను చూసి మనం నేర్చుకోవాలి నిజానికి వారికి ఉన్నంత దేశాభిమానం మనవారికి లేదనే చెప్పాలి ప్రతిదీ ఎక్కడినుంచో అరుగు తెచ్చుకోవాలని ఆలోచన తప్ప స్వతహాగా మనమే చేయాలి అన్న సంకల్పం ఉన్నవారు అరుదు అలాంటి ప్రదేశంలో నివసించాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండడం సహజం అంటారు బందా.
నటనకు వ్యాకరణం - బందా గారు (37);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి