గ్రీటింగ్ కార్డ్స్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 గ్రీటింగ్ కార్డ్స్ అనేవి అసలు గుర్తున్నాయా మీకు? నా వరకు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేవి గ్రీటింగ్ కార్డ్ సే.
ఎందుకంటారా ఇప్పుడంటే న్యూ ఇయర్ అంటే కేక్, స్వీట్స్, పార్టీస్ లాంటి మాటలను వింటున్నాం. ఈతరం చిన్నపిల్లలు కూడా నాన్న న్యూ ఇయర్ వస్తుంది కేక్ తెచ్చావా?
మనం నైట్ కట్ చేయాలి కదా అంటూ తెగ హడావిడి చేసేస్తుంటారు. స్కూల్లో, లాస్ట్ న్యూ ఇయర్ మేము చాలా బాగా జరుపుకున్నాం ఇయర్ ఇంకా పెద్ద కేక్ తెచ్చుకుంటున్నాం అంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు న్యూ ఇయర్ అయ్యేంత వరకు.
కానీ నా చిన్నతనంలో  ఇలాంటి హడావిడి ఏది కనిపించేది కాదు. న్యూ ఇయర్ వస్తుందన్నగా ఒక వారం ముందు నుంచి కిరాణా షాపుల్లో, ఫాన్సీ షాపుల్లో బయట గ్రీటింగ్ కార్డ్స్ ని వేలాడ తీసేవారు. అవి చూసి
గ్రీటింగ్ కార్డ్స్ కోసం నాన్నని డబ్బులు అడిగి నచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ కొని తెచ్చుకునే దాన్ని.
అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ అన్ని ఫేవరెట్ హీరో, హీరోయిన్, రోజ్ ఫ్లవర్స్, గాడ్స్, బటర్ ఫ్లైస్ లాంటివి ఉండేవి.
క్లాస్మేట్స్ అందరికీ ఇష్టమైనవి అడిగి తెలుసుకుని ఇష్టమైన హీరో ఫొటోస్ వాళ్లకోసం ప్రత్యేకంగా దాచి ఉంచేదాన్ని,
నా ఫ్రెండ్స్ కూడా నాకు నచ్చిన హీరో ఫొటోస్ కానీ, రోజ్ ఫ్లవర్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ ను కాని నాకు ఇచ్చేవారు. అవి చాలా భద్రంగా దాచుకునే దాన్ని.
గ్రీటింగ్ కార్డ్స్ కొనడం, ఇవ్వడం అంతేనా అని అనుకుంటారేమో... వామ్మో కాదండీ గ్రీటింగ్ కార్డ్ ఒక షీట్ కి 8 ఫొటోస్ ఉండేవి, 2
వరుసలో. అవి జాగ్రత్తగా అటు ఇటు పోకుండా కట్ చేసి దానికి మళ్ళీ కవర్ పేపర్ (అంటే పోస్ట్ కవర్ లాంటిది) దాని బయట ఫ్రమ్ అని నా పేరు రాసుకొని, టూ అని ఫ్రెండ్ పేరు రాసి ఇచ్చేదాన్ని.
టీచర్స్ కి ప్రత్యేక మండోయ్
వాళ్లకి 2 రూపాయల స్టెప్ గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఉండేవి. అది వారి కోసమని ఎంతమంది టీచర్స్ ఉన్నారో అంతమందిని కౌంట్ చేసుకుని అన్ని గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చి జనవరి ఫస్ట్ రోజు వాళ్లకు ఇచ్చేవాళ్ళం.
గ్రీటింగ్ కార్డ్స్, చాక్లెట్స్, విషెస్ అన్నీ అయిపోయాక స్కూల్ నుంచి బయటికి వచ్చేసి గ్రూప్ గా అందరం కలిసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్లేవాళ్ళం. కొత్త బట్టలు కదా ధరించింది అందరికీ చూపించాలి కదా మరి....! మా ఫ్రెండ్స్ అందరి ఇళ్లు దగ్గరగానే ఉండేవి వాళ్ళ ఇంటికి వెళ్లి అందరికీ గ్రీటింగ్స్ చెప్పి, చాక్లెట్స్ ఇస్తే తినేసి తెగ తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు జనవరి ఫస్ట్ ఉంటే స్కూళ్లకు సెలవు విషెస్ చెప్పాలంటే సెల్ ఫోన్స్ మెసేజెస్. ఎవరింట్లో వారి సెలబ్రేషన్స్ అంతే...
ఇది ఈనాటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... పాత రోజులే బాగుంటాయి కదూ....
సరే అయితే మీరు కూడా న్యూ ఇయర్ ని సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని కోరుకుంటూ...అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను....


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం