ఎన్నో.....ఎన్నెన్నో......
వేళలు మరిపించిన వేడుకలు ఎన్నో,,,
ఒడి చేరి వేధించిన వేదనలు ఎన్నో,,,
చనువు చెంత గిలిగింతలు ఎన్నో,,,
చెంప తడిమిన చెమరింతలు ఎన్నో...
సందుగొందులలో సాగిన సరదాలు ఎన్నో,,,
మాటల పైన మౌనం వేసిన పరదాలు ఎన్నో...
తొందరపాటు నిషా దారి తీసిన తగవుల మరపులు ఎన్నో,,,
తడిపొడి మనసులో తుంటరి ఎదసడి దాచిన తలపులు ఎన్నో...
చిలిపి చెలిమి ఆటలో చిర్రుబుర్రు కోపాలు ఎన్నో,,,
వసివాడని వయసు వెక్కిరింతల వేషాలు ఎన్నో...
కల్లబొల్లి కబురులు కల్పించిన కలహాలు ఎన్నో,,,
దిక్కు తోచని దశలో దారి చూపిన సలహాలు ఎన్నో...
బెట్టు చూపుతూ మెట్టు దిగని మొహాలు ఎన్నో,,,
కడదాకా కాలంతో కొనసాగిన చిరునవ్వుల స్నేహాలు ఎన్నో...
గతం గడిపిన జ్ఞాపకాల సంతకాలు ఎన్నో,,,
కన్నీరు పెట్టించిన కన్నీటి అంపకాలు ఎన్నో...ఎన్నెన్నో...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి