డైరెక్షన్ ఫర్ యూజ్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 దాదాపుగా పెడియాట్రిక్స్ వార్స్ లో మోట్లీ ప్రిస్స్క్రిబ్ చేసేవి సిరప్స్ అండ్ డ్రాప్స్.
ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని సిరప్స్ లిక్విడ్ అంటే సస్పెన్షన్ లా ఉంటే మరి కొన్ని మాత్రం పౌడర్ రూపంలో అవైలబుల్
అవుతాయి. ఇలా వయల్ లో పౌడర్ గా లభించేవి ముఖ్యంగా యాంటీబయోటిక్స్. అంటే పిల్లలకు కలిగే ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి వైద్యులు సూచించే మందులన్నమాట.
హా...ఆ చూశాం చూశాం మా పిల్లలకు వేసేటప్పుడు అని 
గుర్తుతెచ్చుకుంటున్నారు కాబోలు... అయితే ఈ పౌడర్లను మొదటగా లిక్విడ్ రూపంలోకి మార్చుకున్న తర్వాతే పిల్లలకు అందించాలి.
సాధారణంగా పౌడర్లో కలపవలసిన ద్రవాన్ని ఆ ఫలానా కంపెనీ వారే డ్రగ్ కంటైనర్ లో కలిపి ప్యాకింగ్ చేసి కంబైన్ గా అమ్మడం జరుగుతుంది. సపోస్ ఇప్పుడు జింక్ సిరప్ ఉందనుకోండి అందులో కలపవలసిన ద్రవం అంటే స్టరైల్ వాటర్ ఫర్ ఇంజక్షన్ ను అందులోనే విడిగా ఉంచుతారు కాబట్టి మనం సులభంగా ఆ పౌడర్లో కలపవచ్చు. అన్ని సిరప్స్ ఇలా కాదండోయ్... ఒక్కొక్క సిరప్ కి డయల్యూషన్ అనేది ఒక్కోరకంగా ఉంటుంది. అగుమెంటిన్ సిరప్ అయితే 
కాచి చల్లార్చిన నీళ్లను ఆ పౌడర్లో కలిపి ఆ బాటిల్ పై ఉన్న కొలత వరకు ఆ నీళ్లను నింపాలి. అప్పుడే ఆ మెడిసిన్ 
సమపాళ్ళాలో డిస్ట్రిబ్యూట్ అయ్యి దాన్ని సేవించినప్పుడు
డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా
బాడీ వెయిట్ కి సరిపోతుంది. 
మీకేమండి డాక్టర్ కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు మాకేం తెలుసు అని  మూతి ముడుచుకున్నారా ఏంటి?
నాకే కాదు... మీక్కూడా ఇవన్నీ తెలుసు... అదెలా అని ఆశ్చర్యపోతున్నారా..! ఇలాంటి డైల్యూషన్స్ అన్ని డాక్టర్లకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆ సిరప్ కవర్ మీదే డైరెక్షన్ ఫర్ యూజ్ అని అన్నీ ఇంస్ట్రక్షన్స్ ను ముందే ముద్రించి ఉంటారు. అయితే మనం అది పెద్దగా పట్టించుకోము. మనకు ఏ డాక్టరో లేదా మందులు కొన్నప్పుడు ఫార్మసిస్టో చెప్పాలి కదూ... ఫార్మా కంపెనీస్ ప్రతి ఒక్క మెడిసెన్ కు ప్రికాషన్స్ ను కచ్చితంగా సిరప్ బాటిల్ మీద కానీ, టాబ్లెట్ కవర్ మీద కానీ తయారు చేసేటప్పుడే ముద్రిస్తారు. ఎంత డోస్ తీసుకోవాలి అనేది డాక్టర్ నిర్ధారించిన తర్వాతే తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటి డైల్యూషన్స్ అనేవి చదివి అవగాహన చేసుకున్న తర్వాత సూచనలను అంటే ఏ టెంపరేచర్లో స్టోరేజ్ చేయాలి, ఉపయోగించే ముందు షేక్ చేయాలా లేదా వంటివన్నీ అనుసరిస్తే పిల్లల విషయాలలో అవకతవకలు జరిగే ఆస్కారమే ఉండదు. కాబట్టి ఇకనుంచి సిరప్స్ కొన్నప్పుడు డైరెక్షన్ ఫర్ యూస్ అని అట్టపై వున్న కాలమ్ ను తప్పక చదవండి.... చదువుతారు కదూ.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం