అలెగ్జాండర్ యుద్ధ నిపుణుడు తన గురువు అరిస్టాటిల్ దగ్గరకు వెళ్లి భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నానని చెప్పినప్పుడు అలా చేయవద్దని వారించాడు గురువుగారు. కానీ తనమొండి పట్టుదలను వదలలేదు చివరకు గురువుగారిని తిరిగి వచ్చేటప్పుడు భారతదేశం నుంచి ఏం తీసుకురమ్మంటారు అని అడిగితే నాకు ఐదు వస్తువులు కావాలి వాటిని తెచ్చి ఇవ్వగలిగితే నీ జన్మ ధన్యం అని మొదటగా ఆయన అడిగినది భారతదేశంలోని నీ ఇష్టం వచ్చిన చోట ఒక పిడికెడు మట్టిని ఈ దేశానికి తీసుకురా అంత పవిత్రమైన ప్రపంచంలోనే అగ్రగణ్యులైన ఋషి పుంగవులు నడయాడిన నేల అది. దానిని బొట్టుగా ధరించిన ప్రతివాడు తన జీవితాన్ని స్వార్థకం చేసుకున్న వాడే. రెండవది గంగా నది నీరు ఆ పవిత్ర నదిలో నుంచి ఒక గుక్కెడు నీరు తీసుకురా ఆ నీటిని చూసినా స్పర్శించిన అనుభవించిన జీవితంలో మరుజన్మకు ఆస్కారమే లేదు భారతీయులందరూ ఆ పవిత్ర స్థలాన్ని దర్శించి ఆ గంగా నదిలో స్నానం చేసి తిరిగి వస్తారు కనుక భారతీయులు అందరూ పవిత్రులే. మూడవది ప్రపంచానికే ఆదర్శప్రాయమై శత్రువులతో సహా పొగడ్తలండిన వాల్మీకి మహర్షి విరచిత ఆది గ్రంథం ప్రపంచానికి ధర్మాన్ని చాటి చెప్పిన పవిత్ర గ్రంథం అది దానిలోని ప్రతి వాక్యం శిరోధార్యమే ధర్మముతో కూడిన ధర్మ సూక్ష్మాన్ని ప్రతి మనసుకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన ఆది కవి వాల్మీకి మహర్షి అది చదివిన ప్రతి అజ్ఞాని, విజ్ఞానిగా మారటం ఖాయం తరువాత వారు అడిగిన నాల్గవ కోరిక ఆంధ్ర మహాభారతాన్ని తీసుకు రామ్మన్నాడు భారతము అంటే వెలుగుచూపునది అని అర్థం మన దేశంలో ప్రతి ఒక్కరూ దానిని చదివినట్లయితే అందరూ సొంత కుటుంబాలలా ప్రవర్తిస్తారు చివరిగా నీవు చేయగలిగితే వారిని ప్రార్థించి ఒక గురువును మనదేశానికి పంపించమని అడుగు రాజసంతో కాకుండ వినయ విధేయలతో అడుగు ఒక్క గురువు ఈ దేశంలో కాలు పెడితే ప్రతి ఒక్కరి మనసు పునీతమవుతుంది ప్రతి ఒక్కరిలో ఉన్న తమస్సు చీకటిని పారద్రోలి జ్యోతిని వెలిగించి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపగలిగిన మహానుభావుడు అని భారతదేశం గురించి చెప్పితే అలెగ్జాండర్ ఆశ్చర్యపడి గురువుగారికి పాదాభివందనం చేశారు మన దేశ ఔన్నత్యం మనకు తెలియకపోయినా ప్రపంచ మేధావులందరికీ తెలుసు.
మన దేశ ఔనత్యం;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి