కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మనం సరిగ్గా గమనించినట్లయితే కొన్ని ఊతపదాలు వినిపిస్తూ ఉంటాయి ఆ పదం వారికి ఎలా అలవాటు అయిందో వారికే తెలియదు ఆ ప్రయోగం ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు మా అమ్మాయి కాలేజీలో చదువుతోంది అంతకుముందు మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలిచేది దాని అర్థం ఏమిటో దానికి తెలియదు మాకు తెలియదు ఇప్పుడు ప్రత్యేకంగా మేడమ్ అనే పేరుతో మొదలు పెట్టింది అలాగే కొంతమందికి ఏ విషయం విన్నా అయ్యో పాపం అంటారు ఏదైనా కష్టం బాధ కలిగించే విషయాలు అయితే ఆ మాట అనవచ్చు. మన చిన్ని గారు మొన్ననే వివాహం చేసుకున్నాడు వక్కింటివాడు అయ్యాడు అని చెప్పగానే అలవాటు ప్రకారం అయ్యో పాపం అంటుంది తెరిసా తెలియకనా. మా ఆఫీసులో రకరకాల మనుషులు రకరకాల పద్ధతులు వినిపిస్తూ ఉంటారు నేను అక్క అని పిలుస్తాను కమల గారిని. ఎవరైనా అపశబ్దాల వాడినప్పుడు మీ నోట్లో పంచదార పోయా అంటుంది దానివల్ల ఏమిటి నోరు మూయమని చెప్పడమా నోట్లో పంచదార పోస్తే జరిగేది అదే కదా. మరొక ఆయన మనం చెప్పగానే అయ్యయ్యో సరే వెళదాం పదండి అంటూ ఆ విషయాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు అంటే వారికి ఆ విషయాన్ని గురించి గానీ వేరే విషయాలు గురించి గానీ వినడం నచ్చకనా కారణం మనకు తెలియదు ఇంకొకరు చెప్పాను వింటున్నావా అంటే అతను చెప్తోంది మనం వినడానికే కదా అలా ఎందుకు అంటున్నాడు అతనికి తెలియదు సమాచారం ఏమి చెప్పగలరు ఎందుకు అని అడిగితే.
చాలామంది ఉపన్యాసాల్లో కూడా మరి అనేది ప్రతి రెండు మూడు వాక్యాలు వాడుతూ ఉంటారు. అది అలవాటు తప్ప అర్ధవంతమైనది కాదు విశ్వనాథ సత్యనారాయణ గారి ఊతపదం అందరికి తెలిసిందే చిత్రం ఏమిటంటే అనకుండా వారికి మాట కుదరదు వారు చెప్పే విషయం చిత్రంగా ఉండవచ్చు కానీ వారు ఆ అర్థంలో మాట్లాడరు అది వారి ఊత పదం కొంతమంది ఆడవాళ్లకు మరో గమ్మత్తయిన ఊత పదం ఉంటుంది నీ కడుపు బంగారం కాను అంటే అది శాపమా లేక వరమా ఆమె కడుపు మొత్తం బంగారంతో నిండిపోతే ఆవిడ వంశం పూర్తిగా సర్వనాశనం అయిపోయినట్లే కదా కానీ ఆమె అనుకున్నట్టు ఆర్థికంగా పుష్టిగా సౌఖ్యంగా ఉండమని దీవించటం కానీ దానిని మార్చలేదు కదా అలా అర్థాలు ఉంటాయి అన్న అర్థం కూడా తెలియకుండా వాడినప్పుడు అది ఎంత అనార్ధనికి మూలమవుతుందో వాళ్లకు తెలియదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి