ఫిట్స్ ( సీజర్స్);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 యాజ్ ఏ క్లినికల్ ఫార్మాసిస్ట్ గా నా నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది అంటే నాకూ సంతోషమే. అందుకే నేను తెలుసుకున్న విషయాలను మీతో ఎప్పటికప్పుడు పంచుకునే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను అయితే ఈ రోజు మనం ఫిట్స్ రిలేటెడ్ కొన్ని విషయాలను చర్చిద్దాం. ఫిట్స్ ని సీజర్స్ అని
అంటారు. సాధారణంగా మనం  మూర్ఛ అని సంబోధిస్తూ ఉంటాం. అయితే ఈ వ్యాధికి వయసుతో సంబంధం లేదు పిల్లలు, పెద్దలు అందరూ దీని బాధితులే. పెద్దలైతే వారి హెల్త్ కండిషన్ పట్ల అవగాహనను కలిగి ఉంటారు కాబట్టి వారి జాగ్రత్తలు వారే తీసుకోగలరు మరి పిల్లల విషయమో... 
అవును పిల్లలలో కొంతమందికి ఈ సీజర్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ హేరిడేటరీ పరంగా, జీన్ లోపం కారణంగా, అధిక స్ట్రెస్ ను ఫీల్ అవ్వడం వల్ల, జ్వరం వల్ల, మరి ఇతర కారణాల వల్లనైనా ఈ ఫిట్స్ అనేవి రావచ్చు. అయితే డాక్టర్స్ వీటికి యాంటీ ఎపిలెప్టిక్స్ అన్న మందులను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. పిల్లలకైతే సిరప్స్ కూడా యవైలబిలిటీలో ఉంటాయి. అయితే మనం చూస్తూ ఉంటాం కొంతమందికి
ఈ ఫిట్స్ వచ్చినప్పుడు కింద పడిపోయి గిలగిలా కొట్టుకోవడం జరుగుతుంది, మరి కొంతమంది స్పృహను కూడా కోల్పోతూ ఉంటారు. 
అయితే పక్కనే ఉన్న వారు మాత్రం ఇనుముకు సంబంధించిన వస్తువులను వారి చేతులకు అందించడం, తాళం గుత్తి లాంటివి స్పూన్ లాంటివి తీసుకొచ్చి వారి నోట్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల సీజర్స్ అనేవి తగ్గుతాయని వారి నమ్మకం. 
వారేంటండి నేనే స్వయంగా చూశాను నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రేయర్ పూర్తయిన తర్వాత గ్రౌండ్ నుంచి అందరం వరుసగా లైన్లో క్లాస్ రూమ్ లోకి వెళుతూ ఉన్నాం అప్పుడు సడన్ గా మా క్లాస్మేట్ కి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దాంతో మా హెడ్ మిస్ పరిగెత్తుకు వచ్చి తాళాల గుత్తిని చేతిలో పెట్టింది. కొంతసేపటికి సీజస్ తగ్గిపోయాక అతన్ని ఇంటికి పంపించారు. దాంతో నేను కూడా స్పూన్ తాళాలు లాంటివి పెడితే ఈ ఫిట్స్ 
తగ్గిపోతాయని బలంగా నమ్మేదాన్ని. అయితే ఈ మెడికల్ ఫీల్డ్ లో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్  ను గెయిన్ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. అవేం టంటే ఈ సీజర్స్ అనే వాటికి టైం డ్యూరేషన్ ఉంటుంది సీజర్స్ చాలా టైప్స్ ఉంటాయి
అయితే ఇవి బ్రెయిన్ లోకి న్యూరాన్స్ లో ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ  జరగడం వల్ల సంభవిస్తాయి. కొందరికి ఒకసారి వచ్చి ఆగిపోవడం మరికొందరికి రెండు మూడు నిమిషాల వ్యవధిలో ఓ నాలుగైదు సార్లు రావడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు మనం వాటిని ఆపే ప్రయత్నం ఎట్టి పరిస్థితులలో చేయకూడదు. ఎందుకంటే ఇవి బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసే న్యూరాన్స్ లో అబ్నార్మల్ ఫైరింగ్ జరిగి  స్వయంకృతంగా సంభవిస్తూ ఉంటాయి. వీటిని ఆపడం వల్ల మనం ఆ ప్రాసెస్ ని డిస్టర్బ్ చేస్తాం అందువల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది.
బ్రెయిన్ సెల్స్ డెత్ అవడం వల్ల అనేక రకాల న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక ఎప్పుడూ ఈ పొరపాట్లు చేయకండి. సీజర్స్  ఆగేంతవరకు వేచి ఎన్ని నిమిషాల వ్యవధిలో ఈ ఎటాక్ వస్తుందో పరిశీలించినట్లయితే అది ట్రీట్మెంట్ కు ఎంతగానో తోడ్పడుతుంది. అంతేగాని స్పూన్లను నోట్లో ఉంచడం వల్ల  వారికి మరింత హాని కలుగుతుందే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని గుర్తించండి.   
మరి నేను చెప్పింది గుర్తుంచుకుంటారు కదూ....కామెంట్‌లు