భారతదేశంలో పల్లెటూరు నుంచి నగరాల వరకు ఎక్కడైనా ఒక నాయకుడు ఆ ప్రాంతాన్ని నడిపించగలవాడు కావాలి అంటే అది ఎవరి వద్ద శిక్షణ పొందితే వచ్చేది కాదు జన్మతః అతనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యం శీల సంపద జీవితంలో తన కృషిని నమ్ముకుని జీవిస్తూ ఇతరులకు సహకరించే వ్యక్తిగా ఉండాలి ఎలాంటి దుష్ట ఆలోచనలు కానీ చెడు అలవాట్లు కాని లేకుండా తనను తాను నిర్మించుకోవాలి అందరితోనూ స్నేహభావంగా ఉండి కలగలుపుగా ఒకే కుటుంబాల వలే మెలిగే వారై ఉండాలి ఎవరికి ఏ ఆపద వచ్చినా మానసికంగా ధైర్యం చెప్పి ఆ ఆపదను తొలగించే ప్రయత్నం చేసేవాడు అందరికీ స్నేహితుడవుతాడు అలాంటి స్థితి ఎవరికైతే ఉన్నదో అతని నడవడిక వల్ల అతను పైకి రావడానికి అవకాశం ఉంటుంది. తాను ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించేవాడు అందరిలా కాకుండా నూతన పద్ధతిలో సృజనాత్మక దృష్టితో ఆలోచించ గలిగిన వారికి ప్రజలు దగ్గరవుతారు స్వతహాగా తెలివి కలిగిన వాడు దానిని తెలుసుకోగలిగినవాడు ఉంటే అతనిని అంత గౌరవిస్తారు ఒక టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎవరూ నాయకత్వాన్ని కోరుకోలేదు ప్రజలే కావాలని వారిని నాయకుడు చేశారు వారి సేవలను అందుకున్నారు వారి వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందే తప్ప ఎలాంటి నష్టాలకు దారి తీయలేదు రాను రాను దేశకాల పరిస్థితులు మారడంతో మనుషుల మనసులు కూడా మారి రాజకీయం రాచకీయంగా గాక వ్యాపార రంగంగా మారిపోయింది. ఇవాళ నాయకుణ్ణి ఎన్నుకోవడానికి ముందు తన కులం వారిని ఎన్నుకొని ఆ కులం వారైతేనే ఓటు వేయడం లేకపోతే లేదు వ్యక్తి ఎలాంటి వాడు ఏం చేయగలడు అన్న దృష్టి లేకుండా పోయింది ఇతను ధనవంతుడా కాదా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకు సహాయం చేయగలడా లేదా అనే ఆలోచిస్తున్నారు తప్ప సమాజానికి పనికి వస్తాడా అన్న విషయం మాత్రం ఆలోచించడం లేదు దుష్ట దురాలోచనా పరులను ఎన్నుకోవడం వల్ల తమకు సహకారిగా ఉంటాడు అని నమ్ముతున్నారు తప్ప సమాజానికి అది చెడు జరుగుతుంది ఇతని వెంట ఎంత బలగం ఉంది వారందరూ మనకు ఉపయోగిస్తారా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప వావిలాల గోపాలకృష్ణయ్య గారి లాంటి నిజాయితీపరుడైన వ్యక్తి ముందుకు వస్తే అలాంటి వారిని నాయకునిగా ఎన్నుకోవడానికి ముందుకు వస్తారా అంటే అది ప్రశ్నార్థకమే.
నాయకుడు అంటే...?;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి