ఎంతో ఆప్యాయంగా చిలకా గోరువంకల్లాగా జీవితాన్ని కొనసాగిస్తున్న నూతన వధూవరుల మధ్య చిచ్చు పెట్టడానికి అనేక రకాల మనుషులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ ఉండవు ఎదుటి వారి బాధలను చూసి ఎంతో ఆనందంతో తృప్తిగా జీవించే వ్యక్తులు వాళ్లు ఈ దంపతుల వల్ల కానీ ఆ కుటుంబాల వల్ల కానీ వీరికి అంతకుముందు ఏమైనా కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయా వాటిని ఈ విధంగా తీర్చుకుంటున్నారా అని ఆలోచిస్తే అలాంటి దాఖలాలే లేవు ఆ కుటుంబంలో ఏ ఒక్కరు ఇతరులతో పేచీ పడడం కానీ వారితో మాట మాట వచ్చి తగాయిదా పడిన సందర్భాలు కానీ ఏమీ లేవు వేమన, భర్తృహరి లాంటి వారు చెప్పిన మానవ విభాగంలో వీరు ఒక రకం వీరి ఆనందం కోసం ఇతరుల నిండు జీవితాలు బలైపోతూ ఉంటాయి. ప్రకృతిలో మానవుడు హాయిగా ప్రశాంతంగా తన పనులు తాను చేసుకుంటూ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ జీవించడం కోసం ప్రకృతి మనిషికి అన్ని వనరులను ఏర్పాటు చేసింది ప్రకృతి సిద్ధంగా ఉన్న గాలి నీరు వెలుగు తో పాటు పంటలు పండించుకోవడానికి పొలాన్ని సాగు చేసే ఆయుధాలను ఇచ్చింది అయినా మనిషి ఆశాజీవి ఆశ లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అయితే దానికి కొన్ని హద్దులు ఉన్నాయి తను ఏది చేయడానికి సంసిద్దుడౌతాడో తన సామర్థ్యం ఏంటో తెలుసుకొని దానికి తగిన కోరికలను ఆశగా పెట్టుకుంటే ఆ ఆశలు తప్పక తీరతాయి విపరీతమైన బద్ధకంతో ప్రణాళికలు వేసుకోవడమే తప్ప పనులు చేయలేని వారి స్థితి ఎలా ఉంటుంది మానసిక విశ్లేషకులు చెప్పేదేమిటంటే ఖాళీగా ఉన్న మెదడు దయ్యాలతో కూడిన నరకం అని. ఇవాళ ఏ ప్రసార మాధ్యమాన్ని చూసినా విన్నా హత్యలు ఆత్మహత్యలు అతి దగ్గర రక్త సంబంధీకులను కూడా క్షణాలలో హత్య చేసే పరిస్థితులు మాటకు మాట పెరిగి అవమాన భారంతో ఆత్మహత్యలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అలా జరగడానికి కారణాలు ఏమిటి ఎవరైనా ఆలోచించారా ఏదైనా ఉదాహరణ చెప్పవలసి వస్తే ప్రయాణికులు అనేక రకాలుగా తమ వాహనాలను నడుపుకుంటూ ఉంటారు కారులో వెళ్లే వాళ్ళు నడిచి వెళ్లే వాళ్ళు స్కూటర్ల మీద వెళ్లే వాళ్ళు ఉంటారు సైకిల్ మీద కానీ స్కూటర్ మీద కానీ బయలుదేరి రోడ్డు వరకు వచ్చి కారణాంతరాల వల్ల రోడ్డు మధ్యలో నిలబడితే తన వెనక వచ్చే ప్రయాణికులు అతనిని తప్పుకొని వెళ్లడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా చొరవచేసి అలా మధ్యలో నిలబడి ఉంటే మా అందరికీ ఇబ్బంది కదా కొంచెం ప్రక్కన నిలబడవచ్చు కదా అని సలహాగా చెపితే పరిస్థితి ఎలా ఉంటుంది.
ఆలోచించండి ; -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి