కన్నీటి కథనం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మొగ్గలు రేపటి కాంతులు,
పువ్వులు నేటి వారసులు,
పచ్చదనం గమ్యాలకు చేరువచేసే ఇంధనం...
ఎండిన ఆకుల సాఫల్యం
తల పండిన అనుభవం...
తరాల బాటలో పయనించి కుటుంబం అన్న కొమ్మకు పునాదులు వేసాను...
అనుబంధాల, అనురాగాల
ఆనంద డోలికలలో ఊయల లూగి కలల సౌధాన్ని ఏనాడో కనుగొన్నాను...
రెప్పపాటు గాలి చాలు
ఉసురు తీసేయడానికి....
చిట్టి చినుకైనా చాలు
బ్రతుకును చిదిపెయ్యడానికి...
పచ్చని జీవితం ఊహాభరితమే అని తెలుసు
అయినా వాస్తవాన్ని అంగీకరించడం 
కాని పని...
క్షీణిస్తున్న ఆరోగ్యం 
సంతోషాలను దూరం చేస్తుంది...
సహకరించని శరీరం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ఒంటరితనం శూన్యంలా భ్రమింప జేస్తుంది... 
సతమతమవుతున్న 
మనసు రేపటి హెచ్చరికలను జారీ చేస్తుంది...
ఆలోచనల ఆందోళనల 
మధ్య 
చీకటి కరిగిపోతుంది...
అయినా తపన, 
వానలో చిందులేస్తున్న చిన్నపిల్లల్లా తీరడం లేదు...
కానీ
కాలం మాత్రం పూచే పూల, రాలే ఆకుల
లెక్కలు సరిచేసేస్తుంది.... ఎప్పటిలానే....
ఓ దృవతార నింగికి ఎగిసిపోతుంది... ఓ ఎండుటాకు నేలకు రాలిపోతుంది...!కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం