కొలతలు జాగ్రత్త మరి...!;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగానే ఉంటారు అని తెలుసు. అయినా నేను గమనించిన
కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని నా అవగాహన మేరకు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటాను. మనం చూస్తూనే ఉంటాం పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తినరు. దాంతో వారిలో ఇమ్యూనిటీ లోపిస్తుంది తరచుగా అనేక ఇన్ఫెక్షన్ల బారిన, వ్యాధుల బారిన పడుతూ ఉంటారు.
పిల్లలకు జ్వరం, జలుబు, నిమోనియా లాంటివి అసహజమేమీ కానప్పటికీ ఇది వచ్చినప్పుడు పిల్లలను పీడియాట్రిక్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లడం ఆ డాక్టర్ కొన్ని సిరప్ లు రాయడం, యాంటీబయోటిక్స్ కోర్స్ ను ప్రిస్క్రైబ్ చేయడం ఇదంతా షరామాములే. అయితే 
నా అనుభవంలో నేను గమనించిన విషయం ఏంటంటే సిరప్స్ మనం కొనుగోలు చేసేటప్పుడే వాటికి మెజరింగ్ కప్స్ అని తెల్లగా మూత లాంటివి ఆ సిరప్ మూతకి అటాచ్ చేసి  ఇవ్వడం జరుగుతుంది.
ఆ మెజరింగ్ కప్స్ పైన మీరు గమనించినట్లయితే 2.5ml అని,5ml అని, 10ml అన్న  
మార్కింగ్ మనకి కనిపిస్తుంది.
ఆ మూత మాకెందుకు తెలియదండి అని అనుకుంటున్నారా ఏమిటి?
అదేం లేదు కానీ పిల్లలకు ఆ సిరప్ మూతలను కొలతలు చేసుకొని వేసే మహానుభావులు చాలామంది ఉన్నారు.
మెజరింగ్ కప్స్ కనిపించినప్పుడు సిరప్ మూత తోనే రెండుమూతలు మూడుమూతలు అని వారికి వారే కొలతలు వేసుకొని పిల్లలకు ఇచ్చేస్తూ ఉంటారు.
అది ఎంత ప్రమాదమో వారికి అప్పుడు తెలియదు. డ్రగ్ ఓవర్ డోస్ ఐ పిల్లలకు వాంతులు, విరోచనాల లక్షణాలు బయటపడ్డాక హాస్పటల్ కు పరుగులు తీస్తే అప్పుడు తెలిసి వస్తుంది వారికి. వారి నిర్లక్ష్యానికి
పసిపిల్లలు బలైపోతూ ఉంటారు. కనుక పసిపిల్లలు ఉన్న ఇళ్లల్లో డ్రాప్ వేసే ఫిల్లర్స్ కానీ,
మెజరింగ్ కప్స్ కానీ ఒకటి అదనంగా పెట్టుకుంటేనే మంచిదని నా ఉద్దేశం.
అలాగే డ్రాప్స్ అని డాక్టర్ రాసినప్పుడు వాటిని తూచాగా లెక్కలు వేసుకుని స్పూన్ తోనో, లేదా నేరుగా నోటిలోనో
పోసేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి.కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం