చెరువు గట్టున మేనును చల్లగా,
తాకుతున్న ఈ చిరుగాలిలో...
ఎండను చాటు చేస్తూ
హాయినిస్తున్న ఈ చెట్టు నీడలో...
పచ్చని కొంగు, ఎర్రని చీర,
తెల్లని రవిక సోయగాల
సొగసులతో....
చెంపన చెవి దిద్దుల,
కొప్పున మల్లెల హొయలతో....
వయ్యారి హావభావాలకు
తొణికిస లాడుతూ,
గాజులు సవ్వడి చేసే,
ఈ ఏకాంత సమయాన
నా కాంత విన్నవిస్తున్న
ఊసుల, బాసలు వింటూ,
తన్మయత్వాన్ని పొంది,
నేను ఒక్క క్షణం…
ఇది కల అని తలిచాను,
నిజం అని మరిచాను...
తాకుతున్న ఈ చిరుగాలిలో...
ఎండను చాటు చేస్తూ
హాయినిస్తున్న ఈ చెట్టు నీడలో...
పచ్చని కొంగు, ఎర్రని చీర,
తెల్లని రవిక సోయగాల
సొగసులతో....
చెంపన చెవి దిద్దుల,
కొప్పున మల్లెల హొయలతో....
వయ్యారి హావభావాలకు
తొణికిస లాడుతూ,
గాజులు సవ్వడి చేసే,
ఈ ఏకాంత సమయాన
నా కాంత విన్నవిస్తున్న
ఊసుల, బాసలు వింటూ,
తన్మయత్వాన్ని పొంది,
నేను ఒక్క క్షణం…
ఇది కల అని తలిచాను,
నిజం అని మరిచాను...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి