ఇదేంటి... టైటిలే చాలా వెరైటీగా ఉంది అని అనుకుంటున్నారా?
లేదా మ్యాథ్స్, సైన్సు అని కొత్తగా పాఠాలు చెప్తుందేంటి మన డాక్టరమ్మ అని తెగ ఆలోచిస్తున్నారా? కంగారు పడకండి లెక్కలు అని చెప్పి బుర్ర తినేయను గాని, పిల్లల విషయంలో పెద్దలకు అవగాహన ఉండవలసిన క్యాలిక్యులేషన్స్ అయితే కొన్ని నేర్పిస్తాను. మరి నేర్చుకుంటారు కదూ... అసలు పిల్లలకి, క్యాలిక్యులేషన్స్ కి సంబంధం ఏంటి అని డైనమా లో ఉన్నారా? నేను మాట్లాడేది పిల్లల సిరప్ ల క్యాలిక్యులేషన్స్ గురించి అండి. మీరు ఎప్పుడైనా గమనించారా పిల్లలకు డాక్టర్ ప్రెస్క్రిప్షన్ రాసినప్పుడు అందులో ఫలనా సిరప్ అంటే
సిరప్ పారాసెటమాల్ 1 tbsp అని కానీ, లేదా 2 tsp అని కానీ రాస్తూ ఉంటారు. డి
ప్రిస్క్రిప్షన్ రాసాక డాక్టర్ కానీ మందులు తీసుకున్నక ఫార్మసిస్ట్ గాని వాడే విధానాన్ని వివరించినట్లయితే పర్వాలేదు కానీ, వివరించకపోతే పరిస్థితి ఏంటి. ఒక స్పూన్ మందు వేయాలేమో అనుకొని స్పూన్ తో పిల్లలకి సిరప్ ని పట్టించేస్తాం. ఇలా చేయడం మంచిదా మీరే చెప్పండి. అసలు 1 tbsp అంటే ఏంటి 1 tsp అంటే ఏంటో ముందు మనకు అవగాహన ఉండాలి.
1 tbsp అంటే 15ml,
1 tsp అంటే 5ml అని అర్థం.
అంతేకానీ 1 tsp చూసి మనం కిచెన్ లో వాడుకునే చెంచాతో
ఇచ్చేయడం వల్ల ఓవర్ డోస్ అవుతుంది దాంతో కండిషన్ మరింత సీరియస్ అవుతుంది. 1 tbsp చూసి
లొట్టవున్న చెంచాతో ఇవ్వడం వల్ల అండర్ డోస్ అయి పిల్లలకు సింటమ్స్ తగ్గవు. అలాగే డ్రాప్స్ కూడా పది చుక్కలు అని రాసినప్పుడు
ఇది వుజ్జయింపుగా లెక్కలు వేసుకుని 1ml లేదా 2ml అనుకొని తాగించడం చాలా చాలా తప్పు. పిల్లల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి.
కాస్తంత నిర్లక్ష్యం కూడా పిల్లల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. సిరప్ డెన్సిటీని బట్టి డ్రాప్ ఫిల్లర్స్ అనేవి ముందుగానే డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి డ్రాప్ ఫిల్లర్స్ తో డాక్టర్ చెప్పిన మోతాదులో వేయడం మంచిది. బేసిక్ నాలెడ్జ్ అంటే చిన్న చిన్న కన్వర్షన్స్ అనేవి ప్రతి తల్లిదండ్రులు తెలుసుకుని ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం. నా మాటతో ఏకీభవిస్తారని భావిస్తూ...
నేను చెప్పిందంతా చదివారు కదూ అయితే మీకు ఎంతవరకు అర్థమైందో ఒకసారి ఇమేజ్ రూపంలో ఇస్తున్న ప్రశ్నను పూరించి
మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి...? ఓకే...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి