"74 వ భారతగణతంత్ర్యదినోత్సవం - పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-- చరవాణి:- 6300474467
 01.
తేటగీతిమాలిక
పూజ్యుడంబేద్కరార్యునిప్రోద్బలమున
భరతరాజ్యాంగమమలులోచరితనొంది
సర్వసత్తాకలౌకికసామ్యవాద
ఆశయాలతోయేర్పడిదేశమందు
హక్కులెన్నియొ,విధులునుఅందరికిని
అందజేసినదినమిది;డెందమందు
జనవరిరువదియారుగావినుతికెక్కి
ఖ్యాతిచాటెనుదిశలకుగాంచుమనుచు
శాంతిమంత్రమ్మునుద్బోధసలిపినిలిపి
పరమపావనసుమశీలిభరతమాత
గర్వముగపతాకమునిండుకాంతులీని
యెగిరెరెపరెపలాడుచుగగనమందు!!!

కామెంట్‌లు