సంపదా నీ చిరునామా ఎక్కడ;-సి. శేఖర్(సియస్సార్),పాలమూరు,9010480557
నా దేశం దోచుకుని దాచుకునేందుకు
దారులనెన్నో చూయిస్తుంది

చెమట విలువ 
రూపాయిలా 
దినదినం దిగజారుతోంది

దేశం ఆకలితో అల్లాడుతుంటే
ఉన్నోడికీ తలవంచడం నాయకత్వ లక్షణం
ఎందుకంటే
రాజకీయం 
కార్పోరేట్ కాలర్స్
పాదాలచెంత బానిసత్వానికలవాటుపడి
పేదోడి బతుకును తాకట్టెట్టేస్తుంది

మాటలముసుగులో కొందరు
మతం ముసుగులో కొందరు
అధికారాన్నెగురేసుకుపోతుంటే
మేధావులు సైతం 
మౌనవ్రతం ముసుగులో తోచనితనంతో చూస్తుంంటే
దోచుకునేటోనికింక తిరుగెక్కడిది
సంపద కిరీటం ఒకరిచేతిలో బందిగాక ఏమౌతుంది?

.


కామెంట్‌లు