ఎంత చిత్రం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 ఎంత చిత్రం గుండు సూదికి తల ఉంది
కానీ తల మీద వెంట్రుకలు లేవు!
సూదికి కన్నుంటుంది
కానీ అది చూడలేదు!
నా బూటుకు నాలుక ఉంది
కానీ అది పాడలేదు కదా!
మా ఊరి నది పరుగెత్తుతూ
పారుతుంది-చిత్రం దానికి కాళ్ళులేవు!
రంపానికి పళ్ళున్నాయి
కానీ ఏం ప్రయోజనం ?అది తినలేదు!
గడియారానికి మొహం ఉంది
కానీ ఆ మొహానికి నోరు లేదు!
అగ్గి పుల్లకు తల ఉంది కానీ
తెలివేది? దేన్నైనా కాల్చేస్తుంది!
తరచి చూస్తే ప్రతి వస్తువులో
ఒక విచిత్రం!
(క్రిస్టినా జార్జియానా రోజెట్టి కవితకు స్వేచ్ఛాను వాదం)
               ******      *******

కామెంట్‌లు