చిట్టి చిట్టి పాపలు చిన్నారి పాపలు
చిలుక పలుకులు ,చిగురించే మొగ్గలు
సిరివెన్నెల కుప్పలు చింతలేని పలుకులు
కుందనపు బొమ్మలు నవ్య కళా జల్లులు
ఆటలన్నీ బొమ్మలతో ఆనందాల హరివిల్లులు
అచ్చర సముదాయపు పలుకులు
అందమైన కుందనాల బొమ్మలు !
ప్రతీ మాటకి ప్రతి భావాలు,
ప్రతీ రూపానికి ప్రగతి స్వరూపాలు
సంతోషపు నిలయాలు సర్వాంగ సుందరాలు
అందరికీ ఆనంద సంద్రాలు!
భగవంతుని రూపాలు లేలేత హృదయాలు
భావాల లోగిళ్ళు భవితకు పునాదులు
బంగారు వన్నెలు రంగారు చిరుదివ్వెలు
చిట్టి చిట్టి పాపలు చిన్నారి పాపలు!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి