చిట్టి చిట్టి పాపలం చిరులేత మొగ్గలం
అమ్మ నాన్నల ప్రేమ ఫలాలం
అమ్మ చేతి నిగ్గులం
అపరంజి బొమ్మలం
అల్లరిలో దిగ్గజులం
ఫ్రభంజనానికి వారసులం
నిజం నిగ్గు తేల్చుధీరులం
నిర్మొహమాటపు పలుకులం
అమాయకులం,అభిమానానికి
ప్రతిరూపాలం,మనోరంజితాలం
పాపమంటె తెలియని వారం
అందుకే పాపాయిలం!!
పరమాత్మ స్వరూపులం
పిలిస్తే పలుకుతాం
ప్రేమకి ప్రతి స్వరూపాలం!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి