పిల్లలు మీకు శ్రీరాముడి గురించి చెబుతాను.
అందగాడు సుందరమైన శరీరము కలవాడు
ఆజాను బాహువు, తామర పూల వంటి కనులు కలవాడు కమనీయ హృదయుడు , కారుణ్యమూర్తి
మితభాషి నవ్వుతూ తనకు తానుగా పలకరించువాడు.
సత్యమునే పలుకువాడు ఎదుటివారిని నొప్పించడు
పెద్దలను గౌరవించును, గర్వము లేదు, మంచికి మారుపేరు
ప్రేమకు ప్రతిరూపం, ప్రతి ఒక్కరిని ప్రేమతో సమానంగా చూచువాడు.
నవ్వుతూ సంభాషించువాడు సంభాషణ శుతి మెత్తగా చేయువాడు. నిర్మల హృదయుడు
ఏక పత్ని వ్రతుడు అందుకే సీతమ్మ ఆయన సతీమణి.
స్త్రీలను గౌరవించువాడు అందుకే మన్ననలు
పొందాడు
సరళ స్వభావుడు సాధు జనులను కాపాడువాడు.
మర్యాద తో మాట్లాడు వాడు మనసులు దోచుకునేవాడు
రాముడికి ఆంజనేయుడన్న చాలా ఇష్టం
ఆంజనేయుడికి ప్రాణము రాముడు ప్రతి నిమిషము ఆయన నామమే స్మరణము రామా, శ్రీ రామ్ అని
అన్నదమ్ములకు అనుంగు సోదరుడు ముగ్గురు తల్లులకు ముద్దుల బిడ్డ. రామా అని పిలిచిన పలుకువాడు రమణీయంగా మన హృదయాలలో నిలుచువాడు రమ్యతతో దీవించువాడు శ్రీరామచంద్రుడు.పాహి ..పాహి.. పాహిమాం!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి