విశ్వవిఖ్యాత గాంచిన వివేకాల
పుట్ట మా స్వామి వివేకానంద
శతకోటి నమస్సులు !
చిన్నతనాన రామకృష్ణ పరమహంస
ప్రియ శిష్యుడు వయ్యావు!!
నిరాశ నిస్పృహ మానవాళికి
ధైర్యాన్ని పుంజుకొని ధీరవంతులుగా
గణనీయమైన గంభీరమైన
జ్ఞాన సంపదతో ముందుకు సాగమన్న
మహా మనీషి, మదిలోని నిలుచు నీమాట!!
పువ్వు పుట్టగానే పరిళమించినట్టు
విదేశాలలో స్వదేశాల కోసం
కన్నీరు మున్నీరు అయినా కమనీయ
హృదయ!
సకల మానవాళికి సమానత్వం
నెఱపి ఉద్ధరించ ప్రభంజనమా నీ
కన్నీటి విలువ కట్ట ఎవరికి తరం!!
అనుదినం అనునిత్యం నువ్వు
ఆశించినది ఏమిటి? అందరి సుఖం
సమానత్వం అందుకే అన్నావు
ప్రతి యువత తనకై కాక దేశం కోసం
. ఒక శక్తిగా సంఘటితంగా పనిచేస్తే!!
దేశం బాగుపడక తప్పదు! యువకులే
దేశానికి వెన్నెముక అన్నావు!!
మనది బంగారు భారతం అన్నావు
నిత్య నూతనంగా వెలగొందాలి అంటే!!
జ్ఞాన సముపార్జన కాదు జ్ఞాన
తపస్సులు కండి, దేశానికి శిరులు
మీ కృషి అని ఆశీర్వదించావు
శ్రీ శ్రీ శ్రీ వివేకానందా నీవు మహా
యోగివి నిత్య నూతన జ్ఞానఖనివి!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి