బహుచక్ర వాహనంకొప్పరపు తాయారు--సెల్ ; :944046079
ఆ కాలంలో పొగబండి,కిటికీ పక్కనే
కూచుంటే,కళ్ళు జాగ్రత్తనీ,కళ్ళు మండు,
కళ్ళల్లో దుమ్ము పడు అన్నీ ఆంక్షలే అయినా కిటికీ పక్క కూర్చోవాల్సిందే!

నేడు విద్యుత్ పై ప్రయాణాల రైళ్లు!
ఎవరి గోడు వారిదే,ప్రత్యేక చల్లని ఏర్పాట్లు 
బయట ప్రపంచం గల్లంతె. ఏమీ తెలియదు కానరాదు!!

నాడు కిటికీ పక్కన కూర్చుని రజినీ గారి 
"పాలపిట్ట రావే పలుకు ఆడి పోవే" అని పాడుకున్న తృప్తి,
నేడు లేదు పిల్లలకి కాలం మార్పు
జోరులో!

వేగాన్ని పుంజుకొని
పరుగులెడుతోంది.
పోతున్నాయి,ఎన్నో అనుభవాలు గతాల దొంతర్ల లోతులలోకి
వెతుకుదామన్నా కానరావు నేడు!!

ఎంతసేపు జోరు

మీద షికారులే
కారు లేని వారు కాలినడకే బ్రతుకు
కాలం పరిహాసంలో ఓడిపోయే వారెందరో గెలిచేవారెందరో?

ఏది ఏమైనా నేటి బాలల నష్టం ఎంతో? 
అందమైన అందాలు అందాల అనుభవాల ఆత్మీయతా సరాగాలు,
ఆ రైలు విన్యాసాలు, కిటికీ లోంచి తొంగి చూచి తోక తీసుకునే వంపులు గుర్తుకొస్తాయి!!

అత్యంతపు కేరింతలు అవి ఏవి
నేటి బాలలకు బాధే!
వేగమే జీవితం కాదు,ప్రకృతిలో ప్రతి ఒక్కటి భగవంతుని వరప్రసాదాలే !!
కామెంట్‌లు