రాధ నయ్యానని బాధగా
ఉంది రాలేను
బాధగా మిగలేనని రోదనుంది ఆశ లేదు
అందుతావని ఆశ ఉంది అందుకోలేని దూరం
పొందుదామని భావనుంది పొందలేను
వెలుగులే అవుదామని తలపు ఎద నిండె
పిరికి తనపు గుబాళింపులు గుండెలు పిండ
చేతకాని శౌర్యం అణువణునీ నరుకుతుంటే
చావలేక చచ్చిన కదలిక నయ్యాను
భావం తెలిసిన బాధతో పరితపిస్తుంటే
తెలియని సమాధానం తెరచాటున ఫక్కుమంది,
నా నవ్వుల పరిహాసం తట్టి లేపుతుంటే.
లేవలేక జారింది నీరసపడ్డ మనసు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి