1. రాణి వలచిన వారు,రాణించని వారు!కాలం ఆపేక్షించిన వారు ,కక్ష కట్టినవారు!సదా ప్రయోజకులు,బహుదా అప్రయోజకులు!పందాలు గెలిచేవారు,పందెమే వేయలేని వారు!వెలిగే దీపాల వారు,పగిలిన ప్రమిదలవారు!2. ఓ జీవన కథ సుధే,మరో కథంతా వ్యధే!.నాటకం సుఖాంతమా,. విషాదాంతమే !కావ్యం నవరసమా ,సరస హీనమే !జీవితం వ్యాస విన్యాసమా,తప్పని ఆయాసమే!సాఫల్యాల సౌధాలా,వైఫల్యాల అవరోధాలే!3. జనతంత్రమా,సర్వత్రా నేతల కుతంత్రమే!ప్రజాస్వామ్యమా,ఏలుతున్నది ధనస్వామ్యమే!అధికారం ఐదవతనం,మగతనం నిలబెట్టడమే!సత్యం, ధర్మం ,అహింస ,నోటి మాటలు !అసత్యం, అధర్మం, హింస,నేటి బాటలు!4. బహిరంగం మాలిన్యం,అంతరంగం నీతి బాహ్యం!మనిషి పరమాన్నజీవి,అదేమిటో పరాన్నజీవి!దీర్ఘరోగి ,ఏమిటో తృప్తి చెందని భోగి!తృష్ణవీడని వింత యోగి,పాశమున్న విరాగి !జీవపరిణామక్రమాన,పెరిగే వింత జీవి!5. జీవితం కరిగే మంచు!నడుస్తున్నది కత్తి అంచు !ప్రతి క్షణం గమనించు!నిర్లిప్తంగా స్వీకరించు !అదే క్లుప్తంగా ముగించు!_________
ఏమున్నది!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి