నా అక్షరాలు (కవిత);-రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురం9441713136
నా అక్షరాలు....
వెన్నెల్లో పాడుకొనే కమ్మనిగేయాలు!
వీనుల విందైన జాబిల్లి గీతాలు!

నా అక్షరాలు...
మమకారం పెంచే నీతి పద్యాలు!
ఉపకారం పెంచే ఉత్తమ కథలు !

నా అక్షరాలు....
ఆలోచన పెంచే పొడుపు కథలు!
సందర్భం తెలిపే చక్కని సామెతలు !

నా అక్షరాలు.....
ఉత్సాహం నింపే ఊయల పాటలు!
ఉల్లాసం పంచే ఊహల ఊసులు!

నా అక్షరాలు......
వ్యక్తిత్వం పెంచే వికాస వాక్యాలు!
విజ్ఞానం నేర్పే ఉన్నత బోధనలు !

నా అక్షరాలు....
మమతలు పెంచే చల్లని భావనలు!
తీపిని పంచే తీయని వాక్యాలు !
కామెంట్‌లు