అచ్చట్ల ముచ్చట్ల పిల్లలం
తప్పెట్లు కొట్టేటి మల్లెలం
బొబ్బట్లు చేసేటివారలం
కొట్లల్లో అమ్మేటి పోరలం !
క్రమశిక్షణ గట్టిగా పట్టుబట్టి
మా శ్రమను తాకట్టు పెట్టి
మేం సాగుతున్నం ముందుకు
మా సంపాదన సొమ్ముకు !
కుట్టు మిషను పెట్టినం
కొట్టులో బట్టలు కుట్టినం
గొంగడిలో మూటకట్టినం
అంగడిలో కాలు పెట్టినం !
నాటకాలను వేస్తుంటాం
వాటికి డైలాగులు రాస్తుంటాం
సూటిగా మేకప్ వేసుకుంటాం
అద్దంలో అందాన్ని చూసుకుంటాం !
మా పనిలోని అర్థం పరమార్థం
కనివిని మేం అందలి గుఢా అర్థం
గుర్తిస్తాం వెంటనే మేము అర్థిస్తాం
యజమానే మా దైవం అని భావిస్తాం!
పని విలువను తెలుసుకొని
ఘని యజమానిని కలుసుకొని
మేం పని ఇవ్వాలని అర్చిస్తాం
మా శ్రమశక్తిని సమర్పిస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి