లాలీ లాలీ లాలీ లాలీ
మచ్చలేని మా జాబిలీ
జోజో జోజో బుజ్జాయి
లొల్లి చేయక బజ్జోవోయి !
లాలీ లాలీ లాలీ లాలీ
ఏమి పాట నీకు పాడాలీ
చెప్పవే నా చిన్ని పాపా
ఉయ్యాల నేనింకా ఊపా !
ఇరుగు పొరుగు వారంతా
సరుగున చేరేరు నీ చెంతా
ఎందుకమ్మ బెంగ నీకూ
మీ అమ్మ చేయులే సోకూ !
మల్లె మొగ్గల దండ కట్టి
నీ బుగ్గన ఓ చుక్క పెట్టి
దిష్టి తీయులే మీ అక్క
పడుకో నీవింక ఎంచక్క !
నింగిలోని ఓ చందమామా
తొంగి తొంగి చూసిందమ్మా
వెండి గిన్నెలోన నీకు బువ్వా
తినిపించులే నీ కింక అవ్వా !
మన చుట్టాలు అంతా వస్తారు
లడ్డు మిఠాయిలు ఇంకా తెస్తారు
వారు కోరి కోరి నీకు తినిపిస్తారు
తీరా చెంతచేరి మరి మురిపిస్తారు. !
నీ కళ్ళకు నల్లని కాటుక పెట్టి
నీ నడుముకు కుల్లాయి కట్టి
నీకు లాలలు వారు పోస్తారు
నీ మెళ్ళో మాలలు వేస్తారు !
నీకు ముక్కు పుల్లనే కుట్టుతారు
బుగ్గన చుక్క బొట్టునే పెట్టుతారు
వారు పట్టు పరుపునే తెస్తారు
కోరి నిన్ను ఇంక పవళింపజస్తారు !
,వారు ముద్ధులెన్నో ఇచ్చుకుంటారు
కోరి సంకలోన నిన్ను ఎత్తుకుంటారు
సూటు బూటు కూడా నీటుగా
వేస్తారు
స్వీటు హాట్ కూడా నేరుగా ఇస్తారు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి